ETV Bharat / state

భారతదేశం సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం : కేెంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy On Indian Culture : భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత అనేవి దేశ మృదువైన శక్తులు. ఇవి యావత్ ప్రపంచాన్ని ప్రభావతం చేస్తూ ఓ సానుకూల మార్గం వైపు తీసుకెళ్తున్నాయి. స్వామి వివేకానంద మొదలుకుని అనేక మంది మహానుభావులు మన గొప్పతనం, సంస్కృతిని చాటి చెబుతున్న వేళ ప్రపంచం భారత్ వైపు గౌరవ భావంతో చూస్తోంది. రంగారెడ్డి జిల్లా కన్షా శాంతి వనంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, హార్ట్‌ఫుల్‌నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు ఈ ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 100 పైగా దేశాల ప్రతినిధులు హజరవుతారు. ఈ కార్యక్రమంలో లక్ష మంది మంది సందర్శకులు పాల్గొననున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 11:55 AM IST

భారతదేశం అంటే సంస్కృతి, ఆధ్యాత్మికత శక్తి : కేెంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy On Indian Culture : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌లోని కన్హా శాంతి వనం వేదికగా ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం-2024 జరగనుంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, హార్ట్‌ఫుల్‌నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 4 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మేళనానికి భారత్‌ సహా 100 పైగా దేశాల నుంచి 300 మంది ప్రఖ్యాత సర్వమత గురువులు తరలిరానున్నాయి. తొలి రోజు ప్రఖ్యాత శంకర్‌ మహాదేవన్, కుమరేష్ రాజగోపాలన్, శశాంక్ సుబ్రమణ్యం నేతృత్వంలో సంగీతకచేరితో ప్రారంభమవుతుంది.

Global Spirituality Mahotsav Program In Rangareddy : ఈ సువిశాల ప్రాంగణంలో 2వ రోజు ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. రాష్ట్రపతి తన సందేశాన్ని ఇస్తారు. 16న 3వరోజు జగదీప్‌ ధన్‌ఖడ్‌ విశిష్ట అతిధిగా హాజరవుతారు. 17న ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల కొన్ని సెషన్లు ఉంటాయి. అంతర్గత శాంతి నుంచి ప్రపంచ శాంతి రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికతతో పాటు సర్వమతి సంభాషణలు ఉంటాయి. ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ అనేది మన దైనందిన అస్తిత్వంలో వివిధ రంగాల్లో మనమందరం పోరాడుతున్న అనేక స్థాయిల సంఘర్షణలు దృష్టిలో ఉంచుతుంది. దీర్ఘకాలిక ప్రపంచ శాంతి సాధించాలంటే దానిలోని సంఘర్షణ పునరుద్దరించాల్సిన అవసరం ఉందన్నది సమ్మేళనం ధీమ్ కావడం ప్రత్యేకత సంతరించుకుంది.

బజా సే ఇండియా 2024 ఈ రేసింగ్‌ పోటీలు - అన్ని ఎలక్ట్రిక్​ వాహనాలు విద్యార్థులు తయారుచేసినవే

గత ఏడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన జీ-20 సమావేశాల కోసం ఎంచుకున్న థీమ్ ‘వసుధైవ కుటుంబకం’ వన్ వరల్డ్ - వన్ ఫ్యామిలీ. ఈ థీమ్‌ జీ-20లో పాల్గొన్న సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లక్ష్యం కూడా ఇదే. ఐకమత్య భావన పెంపొందించడం, సకలజన సమ భావన ప్రోత్సహించడం. ఆధ్యాత్మిక భావన ముందుకు తీసుకెళుతూ ‘వసుధైవ కుటుంబంకం’ ఆలోచన ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలనే సందేశం ప్రపంచానికి పంపాలనేది లక్ష్యం.

Global Spirituality Program : దేశంలో తొలిసారి ఇంత ఉత్సాహంగా ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారం, అనుభవాలు, ఆధ్యాత్మిక, తాత్వికమైన ఆలోచనలు ఈ వేదిక ద్వారా పంచుకోనున్నారు. వీరందరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ, తాత్వికమైన చర్చ జరిగి విశ్వశాంతి కోసం మార్గదర్శనం జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉంది. దీంతో పాటుగా రేపటి తరాల కోసం ఓ ఆరోగ్యకరమైన ప్రపంచం నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ పరిరక్షణ, యోగా, ధ్యానం మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు కూడా ఈ వేదిక ద్వారా ప్రపంచానికి అందనుండటం 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణం.

ప్రపంచాన్ని ఐక్యం చేయడంలో ఇదొక ముందడుగు. ఈ మహత్కార్యంలో భాగస్వామ్యం కానుండటం తమ అదృష్టంగా అనేక మంది ఆధ్యాత్మిక గురువులు భావిస్తున్నారు. అన్ని మతాల ఆధ్యాత్మికవేత్తలను ఒక తాటి పైకి తీసుకొచ్చి విశ్వశాంతికి బాటలు వేసేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ దిశగా తీసుకున్న చొరవ అభినందనీయమని స్వామీజీలు కొనియాడారు. ప్రతి మతం, ప్రతి ఆధ్యాత్మిక సంస్థకు ప్రత్యేకంగా ఒకట్రెండు అంశాలుండొచ్చు. కానీ, అన్ని సంస్థల లక్ష్యం దాదాపుగా ఒక్కటే. ప్రపంచాన్ని ఏకం చేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ప్రయత్నం జరుగుతోంది.

మన చేతిలో ఐదువేళ్లు వేర్వేరుగా ఉన్నట్లే సమాజంలో భిన్నత్వం సహజమే. ఒకరినొకరు గౌరవించుకుని, ఒకరితో ఒకరు కలిసి పనిచేసినపుడు చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. మానవత్వాన్ని విభజించే మతాలకు అస్తిత్వమే ఉండదు. ఐకమత్యం, శాంతి, సమానత్వం బోధించడమే జీవన విధానం కావాలి. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఈ ఆధ్యాత్మిక సమ్మేళనంలో విస్తృతంగా చర్చించడం ద్వారా ప్రపంచానికి మార్గదర్శనం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

"ఛారిటీ జంబుల్‌ సేల్" పేరుతో ఏటా ఎగ్జిబిషన్‌ - అనాథలకు ఆసరాగా అతివల నిర్వహణ

దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యంగా తైక్వాండోలో శిక్షణ ఇస్తున్న యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.