ETV Bharat / state

'హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ముందే ప్రజలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఉండాల్సింది' - MLA Danam About Hydra - MLA DANAM ABOUT HYDRA

Danam Nagender on Hydra : హైడ్రా కూల్చివేతలు చేపట్టే ముందు అక్కడున్న వారికి ముందుగా కౌన్సిలింగ్​ ఇచ్చి ఉంటే బాగుండేదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్​ అన్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్‌ మార్కుల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. త్వరలో పది మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తారన్న ఆయన, హరీశ్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

MLA Danam Nagender About Hydra Demolishes
Danam Nagender on Hydra (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 11:52 AM IST

MLA Danam Nagender About Hydra Demolishes : చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసే ముందు అక్కడున్న వారికి కౌన్సిలింగ్​ ఇచ్చి ఉంటే బాగుండేదని ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో మూసీ నిర్వాసితులను తరలించేటప్పుడు కూడా అధికారులు ప్రజలకు నచ్చజెప్పి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్‌ మార్కులు తదితర అంశాలకు సంబంధించిన విషయాలను సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ మేరకు ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో దానం నాగేందర్​ మీడియాతో మాట్లాడారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్​ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్‌భవన్‌ ప్రాంతంలోని పార్క్‌ హోటల్‌కు శిఖం భూమిలో అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దాని పక్కనే మాజీమంత్రి కేటీఆర్​ స్నేహితుడు, ఆయన బినామి ప్రదీప్‌రెడ్డికి చెందిన ప్రదీప్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో శిఖం భూమిలో పది అంతస్తులకు అనుమతి ఎలా దక్కిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. కేటీఆర్​ ఉంటున్న ఫాంహౌస్​ కూడా ఆయన బినామి ప్రదీప్‌రెడ్డిదేనన్నారు. ఐమ్యాక్స్‌ థియేటర్‌ కూడా చెరువులోనే ఉందని తెలిపారు.

'బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్‌ మార్కులు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తా. అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసే ముందు అక్కడున్న వారికి ముందుగా కౌన్సిలింగ్‌ ఇచ్చి ఉంటే బాగుండేది' - దానం నాగేందర్​, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ నేతలు ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు : శిఖం ల్యాండ్‌లో శోభ కన్‌స్ట్రక్షన్‌కు కూడా పదిహేను అంతస్తులకు పర్మిషన్​ ఎలా ఇచ్చారని దానం నాగేందర్ నిలదీశారు. బీఆర్​ఎస్​ నేతలు హరీశ్​రావు, కేటీఆర్​, సబితాఇంద్రారెడ్డిలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పదోవ పట్టించడం సరికాదని హితవు పలికారు. మూసీనది పరివాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

హైడ్రా నందగిరిహిల్స్​లోని గుడిసెలను కూల్చివేయడానికి వచ్చిన సమయంలో తాను కూడా వ్యతిరేకించి, గుడిసెల జోలికి వెళ్లవద్దని సూచించిన విషయాన్ని దానం గుర్తిచేశారు. ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసని తెలిపారు. హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోమని హరీశ్​రావు అనడం సరికాదన్నారు. హరీశ్​రావు అవగాహన ఉన్న వ్యక్తి అని, ఆయన చీఫ్‌ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారో అని మండిపడ్డారు.

'సిటీకి ఎంతో మంది ఐపీఎస్​లు వస్తుంటారు పోతుంటారు - దానం నాగేందర్ లోకల్' - MLA Danam Nagender On GHMC Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.