Khairatabad Ganesh Almost Finished And Ready for Festival : గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్. అక్కడ కొలువయ్యే గణపయ్య 70 ఏళ్లుగా భక్తుల సేవలందుకొంటున్నాడు. మిగతా ప్రాంతాల్లో ఎక్కడో తయారైన విగ్రహాలను తీసుకొచ్చి ఇళ్లలో, మండపాలల్లో పూజలు చేస్తారు. అందుకు భిన్నంగా ఈ విగ్రహాన్ని నిలబెట్టే చోటే తయారు చేయడం విశేషం. ఈసారి 7 తలలు, 7 సర్పాలు, 12 హస్తాలతో కనువిందుచేయనున్నాడు ఈ విజ్ఞాధిపతి. మట్టి వినాయకుడు, అందులోనూ భారీగా ఉండడం కారణంగా అక్కడే తయారు చేస్తారు.
70అడుగుల మహా గణనాథుడు : అందరికీ ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ భారీ విగ్రహాన్ని పర్యావరణ హితంగా తయారు చేస్తున్నారు. 60 ఏళ్లుగా ఏటా ఎత్తు పెంచుతూ వచ్చి తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ 40 అడుగులకు తేవాలని భావించినా అది అమలు కాలేదు. ఈసారి 30టన్నుల స్టీలు, 10 ట్రాలీల ఇసుక, 80కిలోల జనపనార దారం, 2 వేల గోనె సంచులుతో పాటు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వెయ్యి సంచుల మట్టితో 250 మంది కళాకారులు శ్రమించి రూ.80 లక్షల ఖర్చుతో దీన్ని తయారు చేస్తున్నారు. సుమారు 200 మంది విగ్రహ తయారీలో పాల్గొన్నారు. వీరంతా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు. పీవోపీ లేకుండా మట్టి, సహజమైన రంగులతోనే బడా గణేశ్ విగ్రహాన్ని తయారు చేశారు.
60రోజుల ముందు నుంచి విగ్రహం తయారి : ప్రతి ఏడాది మూడు నెలల ముందు నుంచే విగ్రహ తయారీ ప్రారంభం అవుతుంది. పూజ చేసి మొదలైన విగ్రహ తయారీ వినాయక చవితికి మూడు రోజుల ముందు కన్ను గీసే ప్రక్రియతో పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది అధిక రోజులు రావటం వల్ల రెండు నెలల ముందు విగ్రహ తయారీని ప్రారంభించిన చవితికి రెండు రోజుల ముందు కన్ను గీసే ప్రకియ పూర్తవడంతో గణపతి తయారీ పూర్తయింది.
తొలిరోజు పూజకు గవర్నర్, ముఖ్యమంత్రి : గతేడాది 63 అడుగుల ఎత్తుతో శ్రీ దశ మహాగణపతిని నిలిపితే ఈసారి సప్తముఖ మహా గణపతిని ప్రతిష్ఠించనున్నారు. నవరాత్రుల సందర్భంగా రోజుతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. శివపార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, 70 హోమగుండాలు, రుద్రయాగం, గణపతి యాగం తదితరాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తెచ్చి గణేశ్ మెడలో వేయనున్నారు. తొలి రోజు మొదటి పూజకు గవర్నర్, ముఖ్యమంత్రి హాజరవుతారని ఉత్సవ నిర్వహణ కమిటీ తెలిపింది.
ఇప్పటికే మండపం నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. మరో 2 రోజుల్లో ఈ 70 అడుగుల మహా గణపతి పూజలందుకోటానికి సిద్ధంగా ఉన్నాడు.
ట్యాంక్‌బండ్‌పై విరిగిపడిన భారీ వినాయక విగ్రహం - గంటపాటు నిలిచిపోయిన ట్రాఫిక్