ETV Bharat / state

ఇకనుంచి పాలిటిక్స్​కు దూరంగా ఉంటా'- రాజకీయ సన్యాసం తీసుకున్న కేశినేని నాని - kesineni nani quits politics - KESINENI NANI QUITS POLITICS

Kesineni Nani Sensational Decision on Politics: సార్వత్రిక ఎన్నికలో ఓటమిపాలైన కేశినేని నాని రాజకీయాలకు గుడ్​ బై చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్​ వేదికగా ప్రకటించారు.

KESINENI NANI TWEET ABOUT POLITICS
Kesineni Nani Sensational Decision on Politics (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 10:12 PM IST

Kesineni Nani Sensational Decision on Politics : 2024 ఎన్నికల ముందు జగన్‌ పంచన చేరి ఓటమి పాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణం ముగిస్తున్నట్లు నాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవమని ఆయన తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా, విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో తన సోదరుడి కేశినేని చిన్ని చేతుల్లో నాని ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

"ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటా. నా రాజకీయ ప్రయాణాన్ని ముగించా. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేశా. విజయవాడ అభివృద్ధికి నా వంతు మద్దతిస్తూనే ఉంటా. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు." - ఎక్స్‌లో కేశినేని నాని ట్వీట్

మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుంది : చంద్రబాబు - ted chief CBN Speech at NDA Meet

అప్పుడేమో అలా ఇప్పుడేమో క్యూ కట్టారు - చంద్రబాబు ఇంటికి ఆ అధికారులకు నో ఎంట్రీ - kolli raghuram reddy not allow to meet chandrababu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.