ETV Bharat / state

'ఆ నిర్మాత నన్ను గోవాకు రమ్మన్నాడు - ఇబ్బందికరంగా ప్రవర్తించాడు' - Sexual Harassments in Sandalwood

Sexual Harassments in Kannada Industry : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఇటీవల విడుదల చేసిన జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక అంతటా వైరల్​గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నడ చిత్ర పరిశ్రమలోనూ మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆ ఇండస్ట్రీకి చెందిన నటి నీతూశెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ నిర్మాత తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని షాకింగ్​ విషయాలు బయటపెట్టారు.

Sexual Assaults In Sandalwood Industry
Sexual Harassment in Kannada Industry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 3:52 PM IST

Sexual Assaults In Sandalwood Industry : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్‌ దేశవ్యాప్తంగా వైరల్​ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నడ చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి నీతూశెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు. కన్నడ చిత్ర పరిశ్రమలోనూ మహిళలు వేధింపులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయని నటి నీతూశెట్టి తెలిపారు. గతంలో ఓ నిర్మాత తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

సినిమా చర్చలో భాగంగా ఆ నిర్మాతను కలిశానని, సినిమా గురించి పక్కన పెట్టి హాలిడే కోసం తనతో గోవాకు రమ్మని పిలిచాడని నటి నీతూశెట్టి ఆరోణలు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటించిన ఏ నటినైనా అడగండని, వాళ్ల దగ్గర చెప్పడానికి తప్పకుండా ఒక వేధింపుల కథ ఉంటుందని మరో నటి ఆరోపించారు. అయితే తాను ఎవరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నదని చెప్పాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ హేమ కమిటీ వంటి కమిటీలు అన్నిచోట్లా ఉండాలని, అప్పుడే ఎన్నో విషయాలు బయటకు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

మాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మహిళల ఇబ్బందులు : దాదాపు ఏడేళ్ల పాటు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ, మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై నివేదికను సిద్ధం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పని చేసే పరిస్థితులు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ నివేదికలో వెల్లడించిన పలు అంశాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి.

టాలీవుడ్‌లోనూ మహిళలపై లైంగిక వేధింపులు : ఈ నేపథ్యంలో నటీమణులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు తెలుసుకోవడంపై పలు చిత్ర పరిశ్రమలు సైతం దృష్టి పెట్టాయి. ఇటీవల కర్ణాటక ఫిల్మ్​ ఛాంబర్​ ఆ ఇండస్ట్రీకి చెందిన పలువురితో మీటింగ్​ నిర్వహించి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అడిగి తెలుసుకుంది. టాలీవుడ్‌లోనూ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని 2018 అక్టోబరులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన కమిటీ నివేదికలో వెల్లడైంది. అందులో 12 మంది మహిళలు ఉప కమిటీగా ఏర్పడి కొన్ని సిఫార్సులు చేశారు.

మాలీవుడ్‌లోనే కాదు 'టాలీవుడ్‌'లోనూ అదే పరిస్థితి? - రెండేళ్ల కిందటే సర్కార్​కు రిపోర్ట్ - SEXUAL ASSAULTS IN TOLLYWOOD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.