TDP Leader Kambhampati Rammohan Rao Response on AP Elections : ఎన్నికల ప్రచారం 11వ తేదీతో ముగిసినా జగన్ రెడ్డి ఇప్పటికీ ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు కంభంపాటి రామ్మోహన రావు ఆరోపించారు. ఓ వైపు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా ఐవీఆర్ కాల్స్‌తో ప్రచారం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల కోడ్ ను తీవ్రంగా ఉల్లంఘించడమే అని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.
పుంగనూరు, మాచర్లలో సైతం పోలీసుల వైఫల్యంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా వైఎస్సార్సీపీ నాయకులు వారిని భయభాంత్రులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఐవీఆర్ కాల్స్ పై ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖ రాసామని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న వైఎస్సార్సీపీ వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శాంతిభద్రతలు కాపాడలేకపోయారు - హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం - Chandrababu on Clashes in Palnadu.
Kambhampati Rammohan Rao Camplaint TO EC On YSRCP : మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగిన తీరు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసిందని ఆయన అన్నారు. తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ తీరుపై మండిపడ్డారు. నాయకులే విచక్షణా రహితం వ్యవరిస్తే ఎలా అని ప్రశ్నించారు. పోలింగ్ వేళ వైఎస్సార్సీపీ హింస బాగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వాహనాలపై సైతం విచక్షణా రహితంగా దాడులకు పాల్పడటం వారి రాక్షసత్వానికి నిదర్శమని పలువురు ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.
AP General Elections 2024 : ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లలో ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా శాంతిభద్రతలు కాపాడలేకపోయారని మండిపడ్డారు. ఈసీ వెంటనే పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ - పలుచోట్ల ఉద్రిక్తత - Clashes in AP Elections
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ - స్వతంత్ర అభ్యర్థిపై వైఎస్సార్సీపీ దాడి - andhra pradesh elections 2024