Kamareddy MLA Venkata Ramana Reddy Set up Complaint Box : ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఒకే ఒక్కడు సినిమా తరహాలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేసి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(Kamareddy MLA Venkata Ramanareddy) వినూత్నంగా ఆలోచించారు. నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఈ ఫిర్యాదు బాక్స్‌లో ఆ సమస్యను రాసి వేయాలని ఎమ్మెల్యే సూచించారు. కేవలం వారం రోజుల్లోనే పరిష్కరిస్తామని మాటిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను ఆయన ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ ఫిర్యాదులను స్వయంగా తానే గ్రామాలకు వచ్చి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ ఫిర్యాదు బాక్స్(Complaint Box)లను అన్ని గ్రామాలలో ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఎవరూ వ్యయ ప్రయాసలకు లోనుకాకుండా ఎమ్మెల్యే కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ప్రజలకు ఎమ్మెల్యే(KVR) చెప్పారు.
"కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఫిర్యాదుల పెట్టె ఉంచడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్య వచ్చిన ఆ బాక్స్‌లో పేరు రాసి వేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి గ్రామంలో ఈ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది." - వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్యే
దేశస్థాయిలోనే కామారెడ్డి పేరు మారుమోగుతోంది : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
మంచి మనసు చాటుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే : కామారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల రహదారి విస్తరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ విస్తరణ పనుల్లో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి(BJP MLA Venkata Ramana Reddy) తన సొంతింటినే కూల్చేయించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.6 కోట్లుగా ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే కామారెడ్డి పట్టణ పాత మాస్టర్ ప్లాన్‌లో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి పంచముఖి హనుమాన్ ఆలయం మీదగా రైల్వేగేట్ వరకు ఉన్న రోడ్డును 80 అడుగుల రహదారిగా నిర్ణయించారు.
అయితే ఈ రహదారి ఆక్రమణలకు గురై దాదాపు 34 అడుగులకు తగ్గిపోయి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ విషయాలను గుర్తించిన ఎమ్మెల్యే ఈ రోడ్డు విస్తరణ అత్యంత వేగంగా చేయాలని కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ రోడ్డు విస్తరణ క్రమంలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని పడగొట్టాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు ఏ మాత్రం చింతించకుండా, ఎమ్మెల్యేననే అహంకారం లేకుండా స్థానికులు, పురపాలక, రోడ్డు భవనాల శాఖ అధికారుల సమక్షంలో పొక్లెయిన్లలతో కూల్చివేయించి మంచి మనసు చాటుకున్నారు. అలాగే రహదారుల విస్తరణకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆక్రమణల పేరుతో నిరుపేదల ఇళ్లను తొలగించబోమని స్పష్టం చేశారు.
కాటిపల్లి రమణారెడ్డి - ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది
దేశస్థాయిలోనే కామారెడ్డి పేరు మారుమోగుతోంది : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి