ETV Bharat / state

వడ్డీలు కట్టలేదని వ్యవసాయ భూమి వేలానికి సిద్ధమవుతున్న బ్యాంకర్లు - ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల - Farmers Issues With Dccb Employees - FARMERS ISSUES WITH DCCB EMPLOYEES

DCCB Employess In Kamareddy : నిజామాబాద్ డీసీసీబీ బ్యాంకు అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తీసుకున్న రుణం చెల్లించలేదంటూ కామారెడ్డి జిల్లా పోల్కంపేట్‌కి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు పొలాల్లో అధికారులు వేలం నోటీసు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పొలాలు వేలం వేస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై రాసి ఉంది. ఫ్లెక్సీలతో పాటు పొలంలో ఎరుపు రంగు జెండాలను ఏర్పాటు చేశారు. ఈ వివాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

DCCB Employess In Kamareddy
Kamareddy Farmers Problems With Bank Employees (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 3:36 PM IST

Updated : Jun 14, 2024, 8:14 PM IST

రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు - వడ్డీలు కట్టలేదని వ్యవసాయ భూమి వేలానికి సిద్ధమవుతున్న బ్యాంకర్లు (ETV Bharat)

Kamareddy Farmers Problems With Bank Employees : నిజామాబాద్ డీసీసీబీ బ్యాంకు అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంతో రైతుల భూమిలో బ్యాంకు ఫ్లెక్సీలు పెట్టి వేలం వేస్తామని రైతులను హెచ్చరించారు. కొందరి రైతుల భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఆరా తీశారు. బ్యాంకు అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రికి వెల్లడించారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఇతరులకు విక్రయిస్తుండటం వల్లే అలా పెట్టాల్సి వచ్చిందని బ్యాంకు అధికారులు స్పందించగా మంత్రిగా ఘాటుగా స్పందించారు. ఇలా ప్లెక్సీలు పెట్టడం లాంటి పద్ధతులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి హెచ్చరించారు.

అసలేం జరిగింది : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట్​ గ్రామానికి చెందిన రాజశేఖర్​ రెడ్డి అనే రైతు 2010లో డీసీసీబీ (డిస్టిక్ కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు)లో రూ.5లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. కొన్ని వాయిదాలు చెల్లించి ఆపేశాడు. భూమి మీద తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంక్ అధికారులు రైతుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. రైతు నుంచి సమాధానం రాకపోవడంతో బహిరంగ వేలం వేస్తామని లింగంపేట ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

రైతుల ఇళ్లకు తాళాలు.. పిల్లలతో చలిలోనే అన్నదాతలు..!

"రాజశేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్​ కొనుగోలుకు బ్యాంకులో లోన్​ తీసుకున్నాడు. మేము చాలాసార్లు అడిగినా కట్టలేదు. అయితే దీనిపై అతని భూమి వేలానికి వేయమని మా పై అధికారులు సూచించారు. అందుకే అతని భూమిలో జెండాలు పాతడం జరిగింది. నిన్న కూడా అతన్ని 3గంటల లోపు డబ్బుని కట్టడానికి సమయం ఇచ్చాం అయినా కట్టలేదు. ఇప్పటికైనా సగం లోన్​ డబ్బులు కడితే వేలం ఆపేస్తాం." - కుమార స్వామి, బ్యాంకు మేనేజర్

Kamareddy Farmers Problem : రుణం తీసుకుని పది, పదిహేను సంవత్సరాలు అయ్యి వడ్డీలు పెరిగిపోయాయని, తీసుకున్న రూ.5 లక్షలు రుణానికి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు తెలిపారు. ఇప్పుడు ఇంత మొత్తం చెల్లించడం భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. వడ్డీ తగ్గించాలని బ్యాంకు అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారు తీసుకున్న రుణాల వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలని కోరుతున్నారు. పొలంలో ఫ్లెక్సీలతో పాటు ఎర్రజెండాలను ఏర్పాటు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మేము దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నాం. భూమి చదును చేసుకోవడానికి, పైపు లైన్లు వేసుకోవడానికి తీసుకున్నాం. అప్పటి నుంచి మధ్యలో కరవు వచ్చింది. తర్వాత బీఆర్ఎస్​ ప్రభుత్వం వచ్చింది. రుణాలు మాఫీ చేస్తారు అనుకున్నాం. కానీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. వాళ్లు రుణమాఫీ చేస్తాం అన్నారు. అందుకే మేము చూస్తున్నాం. ఇప్పుడు బ్యాంకు వాళ్లు వచ్చి ఎర్ర జెండాలను పాతిపెట్టారు. రుణవడ్డీలను మాఫీ చేస్తే మేము అసలు కట్టుకుంటాం." - రైతులు

రైతు రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గ భేటీ - ఈ నెల 15 లేదా 18న నిర్వహణ - TG CABINET MEETING ON RUNA MAFI

రైతు రుణమాఫీపై సర్కార్ కసరత్తు - నిధుల సమీకరణకు మార్గాల అన్వేషణ - TS Crop Loan Waiver Scheme 2024

Last Updated : Jun 14, 2024, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.