ETV Bharat / state

కాళేశ్వరం ఆనకట్టలకు తాత్కాలిక మరమ్మతులు - గుత్తేదారు సంస్థలకు నీటిపారుదల శాఖ సూచన - Kaleshwaram Project Inquiry Updates

Kaleshwaram Barrage Temporary Repairs : కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా పనులు చేపట్టాలని గుత్తేదారు సంస్థలకు సూచించింది. కానీ వారు ఏయే పనులు చేయాలి, ధరలు ఎంత అని నీటిపారుదల శాఖను ప్రశ్నించినట్లు తెలిసింది.

KALESHWARAM ISSUE UPDATES
KALESHWARAM ISSUE UPDATES
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 11:00 AM IST

Kaleshwaram Barrage Temporary Repairs : వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం ఆనకట్టలకు (Kaleshwaram Project Issue)తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) అనిల్‌కుమార్‌ గుత్తేదారు సంస్థలకు సూచనలు చేశారు. డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా శాశ్వత మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడంపై బుధవారం ఈఎన్సీ సమావేశం నిర్వహించింది.

Kaleshwaram Barrages Issue Updates : ఈ సమావేశంలో కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి, సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌కుమార్‌, కాడా చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, కాళేశ్వరం ఎస్‌.ఇ. కరుణాకర్‌, మూడు ఆనకట్టల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌ సింగ్‌, ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్కాన్స్‌, నవయుగ, మేఘా గుత్తేదారు సంస్థల ప్రతినిధులు సురేశ్‌, మల్లికార్జునరావు, మనోజ్‌, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

వేసవి సెలవుల తర్వాతే కాళేశ్వరం పిటిషన్ల విచారణ : హైకోర్టు - hc on kaleshwaram project

ఇప్పటివరకు జరిగిన అంశాలను పక్కనపెట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి నీటిని నిల్వ చేయడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. అయితే తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా ఏయే పనులు చేపట్టాలి, ధరలు ఎంత, ఏ పని ఎంత చేయాలి, పనులకు డిజైన్లు ఎవరిస్తారని గుత్తేదారు సంస్థల ప్రతినిధులు నీటిపారుదల శాఖను ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు మూడు ఆనకట్టలు, పంపుహౌస్‌లకు కలిపి సుమారు రూ.600 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుత్తేదారు సంస్థలు నీటిపారుదల శాఖకు చెప్పినట్లు తెలిసింది. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో ఏమైనా సమస్య వస్తే చేయడం వేరని, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు మూడు సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకపోతే ఏం చేయగలమని వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.

ఆనకట్టల పటిష్ఠానికి సంబంధించిన పరీక్షలు చేయలేదని సమావేశంలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీటిని పూర్తిగా తొలగించడం ఇదే మొదటిసారి అని, రెండు బ్యారేజీల్లో ఇసుక మేట వేసి ఉందని, బ్యారేజీలు కట్టి రిజర్వాయర్లలాగా వినియోగించడం వల్ల సమస్యలొచ్చాయనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అదనపు టీఎంసీ పనులకు ఏ అధికారంతో సిఫార్సు చేశారు - 'మేడిగడ్డ'పై మాజీ ఈఎన్సీకి విజిలెన్స్‌ ప్రశ్నల వర్షం - Kaleshwaram Project Inquiry Updates

Medigadda Barrage Damage Updates : మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Incident)ఏడో బ్లాక్‌కు షీట్‌ పైల్స్‌ వేసి గ్రౌటింగ్‌ చేయాలని, రాఫ్ట్‌ కింద గుంతలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకొని చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కోరినట్లు తెలిసింది. పంపుహౌస్‌లు మళ్లీ మునగకుండా ఏం చేయాలన్న దానిపైనా భేటీలో చర్చించినట్లు తెలిసింది. ఆనకట్టల దిగువన నీటి వేగానికి తగ్గట్టుగా చర్యల విషయంలో డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫారసుల ఆధారంగా శాస్త్రీయంగా పనులు చేపట్టాలని కొందరు సూచించినట్లు తెలిసింది. అయితే ఏయే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది, ఎంత వ్యయమవుతుంది, దాన్ని ఎవరు భరించాలనేది తేలకుండా ప్రస్తుతం ముందుకెళ్లే అవకాశం లేదని సమాచారం.

బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? - అధికారులపై ఎన్​డీఎస్​ఏ కమిటీ ప్రశ్నల వర్షం

కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం - ఆధారాలతో సహా జవాబులివ్వాలని సూచన - NDSA Committee On Kaleshwaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.