ETV Bharat / state

'ఈ నెల 16 వరకు అఫిడవిట్లు దాఖలు చేయండి' - పంప్​హౌజ్​ల​ ఇంజినీర్లకు కమిషన్ ఆదేశం - Pumphouse Engineers Inquiry

Pump House Engineers Inquiry Today : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్​ వేగం పెంచింది. ఇందులో భాగంగా నేడు పంప్ హౌస్​లకు సంబంధించిన ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. చీఫ్ ఇంజినీర్ మొదలు ఏఈఈ వరకు మొత్తం 14 మంది ఇంజినీర్లు నేడు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 1:06 PM IST

Updated : Jul 8, 2024, 5:07 PM IST

Justice PC Ghosh
Pump House Engineers Inquiry Today (ETV Bharat)

Kaleshwaram Project Judicial Inquiry Update : కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, తదుపరి సాక్ష్యాల నమోదుకు సిద్ధమవుతోంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చిన అఫిడవిట్లను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత అందులోని అంశాల ఆధారంగా నోటీసులు జారీ చేసి సాక్ష్యాలు నమోదు చేస్తారు. అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ నిర్వహించనున్నారు.

విచారణ ప్రక్రియలో భాగంగా ఇవాళ కమిషన్ ముందు పంప్​హౌస్​లకు చెందిన 14 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ పంప్​హౌస్​లకు చెందిన ఇంజినీర్లు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరులు వారిలో ఉన్నారు. వారి నుంచి అవసరమైన వివరాలు, సమాచారం తీసుకున్న కమిషన్, వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అఫిడవిట్ల దాఖలుకు ఈ నెల 16వ తేదీ వరకు గడువిచ్చారు. పంప్ హౌస్​ల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ఇచ్చిన నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కమిషన్​కు అధికారికంగా సమర్పించింది. నివేదికను పరిశీలించిన తర్వాత అందులోని అంశాల ఆధారంగా కాగ్ అధికారులను పిలిచి పూర్తి వివరాలను తీసుకునే ఆలోచనలో కమిషన్ ఉంది. కమిషన్​కు సహాయకారిగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా మూడు ఆనకట్టలకు సంబంధించి తమ అధ్యయన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్​కు సమర్పించారు.

అటు తుది నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ, విజిలెన్స్ విభాగాన్ని కమిషన్ మరోమారు ఆదేశించింది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కమిషన్ ఆదేశించింది. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో పాటు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

కాళేశ్వరం పంపుహౌస్‌లపైనా పీసీ ఘోష్ కమిషన్ విచారణ - ఇంజినీర్లు, గుత్తేదారులకు నోటీసులు - PC GHOSH COMMISSION ON KALESHWARAM

ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వండి : ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఇటీవల ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటి పారుదల శాఖకు స్పష్టం చేసింది. తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్ఏ ఛైర్మన్​తో ఆయన మాట్లాడినట్లు సమాచారం. పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్​కు కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ - త్వరలో పలువురు నేతలను ప్రశ్నించే అవకాశం! - JUDICIAL INQUIRY ON KALESHWARAM

Last Updated : Jul 8, 2024, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.