ETV Bharat / state

'రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె' - JUNIOR DOCTORS STRIKE IN TELANGANA - JUNIOR DOCTORS STRIKE IN TELANGANA

Junior Doctors Strike in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ వైద్యుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని జూడాలు పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో అధికారులు ముంస్తు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలగకుండా వైద్యుల సెలవులను రద్దుచేశారు.

Junior doctors continue strike
Junior doctors continue strike (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 2:11 PM IST

Updated : Jun 25, 2024, 7:07 PM IST

Junior Doctors Strike in Telangana : సమస్యల పరిష్కారం కోరుతూ రా‌ష్ట్రవ్యాప్తంగా రెండో రోజు జూనియర్‌ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. సోమవారం రోజున వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, డీఎంఈ తో జరిపిన చర్చలు విఫలమవడంతో యధాతథంగా సమ్మె నిర్వహిస్తున్నారు. శిక్షణ భృతి సకాలంలో అందించడం సహా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం వంటి 8 ప్రధాన డిమాండ్‌లను జూడాలు ప్రభుత్వం ముందుంచారు. కొన్ని సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినా మరికొన్నింటిపై స్పష్టత రాలేదు. ఐతే, ఆస్పత్రుల్లో ఇబ్బందులు రాకుండా చూడాలని వైద్యులను ప్రభుత్వం ఆదేశించింది.

రెండో రోజు కోఠి మెడికల్ కళాశాల ముందు జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. వైద్య కళాశాల్లో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం తదితర డిమాండ్లతో ఈ నెల 18న సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతో విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఓపీ సేవలు, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపివేస్తున్నామని, ప్రస్తుతానికి అత్యవసర సేవలు యధావిధిగా కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

వైద్యారోగ్య మంత్రితో చర్చలు విఫలం- కొనసాగుతున్న జూడాల సమ్మె - judas protest in Telangana

జూనియర్ డాక్టర్ల సమ్మెలో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూడాలు రెండవ రోజు సమ్మెలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు వైద్య సేవలందిస్తున్న వారికి సమయానికి వేతనాలు రావడంలేదని వాపోయారు. జూనియర్ డాక్టర్ల ఏడు డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఇప్పటికీ ప్రజలకు వైద్యం అందిస్తూ సమ్మె కొనసాగిస్తున్నామని చెప్పారు.

జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వైద్యుల సెలవులను రద్దు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఓపీ సేవలకు అంతరాయం కలగకుండా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సెలవుల్లో వెళ్లిన వైద్యులందరినీ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు వెల్లడించారు. కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ, సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు సూపరింటెండెంట్లు డా.శంకర్, డా.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.

ప్రభుత్వంతో చర్చలు సఫలం - సమ్మె విరమించుకున్న జూడాలు

Last Updated : Jun 25, 2024, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.