ETV Bharat / state

మీడియాపై దాడులు భగ్గుమన్న నిరసనలు - కేంద్రం జోక్యం చేసుకోవాలని నినాదాలు - YCP attacks on media in AP

Journalists Protests Across the State Against Attacks on Media: మీడియాపై దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు కొనసాగించాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులు చేయించడం సిగ్గుచేటని నేతలు ధ్వజమెత్తారు. శ్రేణులను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రే ప్రసంగాలు చేయడం దారుణమన్నారు. కేంద్రం జోక్యం చేసుకోని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

journalists_protest
journalists_protest
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:33 PM IST

మీడియాపై దాడులు భగ్గుమన్న నిరసనలు - కేంద్రం జోక్యం చేసుకోవాలని నినాదాలు

Journalists Protests Across the State Against Attacks on Media: ఈనాడు దిన పత్రిక కార్యాలయం, ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్​పై వైసీపీ నాయకులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షిబ్లి, సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర బాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వెలుగులోకి తీసుకువస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు చూశామని, ఇప్పుడు మీడియాపై కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మీడియాపై దాడి చేసి రాష్ట్రంలో భయాందోళనలు కలిగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారని అనుమాన వ్యక్తం చేశారు.

YCP Leaders Attacked on Reporter: నంద్యాల జిల్లాలో రెచ్చిపోయిన వైఎస్సార్​సీపీ కార్యకర్తలు.. రిపోర్టర్​పై దాడి..

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో జగన్ రెడ్డి, వైసీపీ గూండాలు మీడియాపై చేస్తున్న దాడులను ఖండిస్తూ టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మీడియా స్వేచ్ఛను కాలరాస్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు దుర్మార్గమని టీడీపీ నేతలు అన్నారు. జగన్ రెడ్డి చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియజేసినందుకు ఆంధ్రజ్యోతి విలేకరిపై, ఈనాడు కార్యాలయంపై చేసిన దాడి జగన్ రెడ్డి అహంకారానికి పరాకాష్ట అన్నారు.

Nellore District: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీపీఎం రాష్ట్ర కార్య దర్శి కామ్రేడ్ రాంభూపాల్ పర్యటించారు. రాష్ట్రంలో ప్రభుత్వమే నేరుగా పత్రికల మీద పత్రిక విలేకరుల మీద దాడులు చేయడానికి సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్​పై, కర్నూల్లో ఈనాడు కార్యాలయంపై దాడులు దురదృష్టకరమని అన్నారు.

'ఈనాడు' కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి - తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం

Visakha District: రాప్తాడులో జర్నలిస్ట్​పై దాడులను తగరపువలస, భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, మధురవాడ జర్నలిస్ట్​లు ఖండించారు. విశాఖ జిల్లా తగరపువలస కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద ఫ్లకార్డులుతో నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. మరోచోట మీడియాపై దాడులను వ్యతిరేకిస్తూ సింహాద్రి అప్పన్న సన్నిధి స్వామివారి తొలిమెట్టు వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. ప్రజా సంఘాలు, వామపక్షాలు మద్దతు తెలిపాయి.

Dr. BR Ambedkar Konaseema District: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్​పై, ఈనాడు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బాధ్యులపై వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Anantapur District: మీడియాపై వైసీపీ దాడులని ఖండిస్తూ ఏపీయూడబ్లూజే(APUWJ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు 'ఛలో అనంతపురం' చేపట్టారు. సంగమేశ్వర్ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సొంత మీడియా మినహా ఇతర జర్నలిస్టులు, పత్రికలపై దాడులు చేయించడమే సీఎం జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పోలీసుల నిర్లక్య ధోరణి వల్లే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. వరుస దాడులపై సీఎం జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

"పెట్రోల్ పోసి తగులబెడతాం - ఈనాడు నిన్ను కాపాడుతుందా?" వైఎస్సార్సీపీ నేతల దారుణం

Alluri Sitaramaraju District: జర్నలిస్టులపై దాడులు ఖండించాలని రాష్ట్ర గిరిజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కర్నూల్ ఈనాడు కార్యాలయంపై , ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్​పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Kurnool District: ఈనాడు కార్యాలయంపై దాడి జరిగి మూడు రోజులవుతున్నా నిందితులను గుర్తించి కేసులు నమోదు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉన్నారనే విషయం పోలీసులకు తెలియదా అని ప్రశ్నించారు. ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీపీఐ నేతలు ఆందోళన చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Tirupati District: మీడియాపై దాడులు హేయమని తిరుపతి తెలుగుదేశం నేతలు అన్నారు. దాడులను వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహం, అంబేడ్కర్‍ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.