Jeevanji Deepthi Parents on Her Winning in Paralympics : ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య ద్వారా చేయూత అందుకున్న వరంగల్‌కు చెందిన దీప్తి జీవాంజి పారిస్ పారాలింపిక్స్ కాంస్య పతకం గెలిచింది. దీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. బిడ్డ విజయం వారి కృషి అపారమైంది. దీప్తిది నిరుపేద కుటుంబం. దీప్తికి మానసిక వైకల్యం ఉండడంతో పసితనంలో ఆమె కోసం తండ్రి యాదగిరి తల్లడిల్లారు. తను పరుగెత్తడం చూసి ఆమెను క్రీడల వైపు మళ్లించాలని అనుకున్నారు. అందుకు దీప్తి క్రీడల్లో రాణించేందుకు డబ్బులకు ఇబ్బంది రాకూడదని యాదగిరి తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేశారు. ఇప్పటికీ దీప్తి తల్లిదండ్రులు రోజువారీ పని చేసుకుంటునే జీవనాన్ని సాగిస్తున్నారు. తాజాగా దీప్తి పారాలింపిక్స్‌లో పతకం సాధించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
‘‘మా అందరికీ ఇది గొప్ప రోజు. దీప్తి అంతర్జాతీయ వేదికపై మెరవడం ఆనందంగా ఉంది. నేను ఒక్కరోజు కూడా పని చేయకుండా ఉండలేని పరిస్థితి. అప్పుడే మేము కడుపు నింపుకోగలం. దీప్తి పోటీపడిన రోజున కూడా నేను పనికి వెళ్లా. ఎలాగైనా ఆమె పతకం గెలిస్తే బాగుంటుందని రోజంతా ఆలోచిస్తూనే ఉన్నా. మా అమ్మాయి పతకం సాధిస్తే స్నేహితులు, బంధువులతో కలిసి సంబరాలు చేసుకోవాలని సహచర డ్రైవర్‌తో చెబుతూ ఉన్నా. ఇప్పుడీ పతకంతో మాకు ఎనలేని సంతోషం కలిగింది." - యాదగిరి, దీప్తి తండ్రి
ఇటీవల ఓ ఛానల్‌తో తన కూతురి గురించి మాట్లాడుతూ దీప్తి తల్లి లక్ష్మి భావోద్వేగానికి గురైంది. గ్రామంలో తన కుమార్తెను ఎగతాళి చేనినా తను ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది.
‘‘ఆమె పుట్టినప్పుడు చాలా చిన్న తల ఉండేది. ఆమె పెదాలు, ముక్కు కూడా అసాధారణంగా ఉండేవి. దీంతో చిన్నప్పుడు గ్రామంలోని కొందరు పిచ్చిదంటూ పిలిచేవారు. ఆమెను అనాథాశ్రమానికి పంపించమని మా బంధువులు కూడా అన్నారు. ఇప్పుడు ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. దేశం గర్వపడేలా చేసింది. దీప్తిని మాకు ప్రత్యేకమైన బహుమతిగా భావిస్తాం," - లక్ష్మి, దీప్తి తల్లి
ఎగతాళి చేస్తే ఇంటికి వచ్చి ఏడ్చేది : చిన్నప్పటి నుంచి దీప్తి చాలా నిశ్శబ్దంగా ఉండేదని దీప్తి తల్లి తెలిపారు. అల్లరి కూడా చాలా తక్కువగా చేస్తుందన్నారు. దీప్తి తండ్రికి రోజుకు రూ.100 నుంచి రూ.150వరకు వచ్చేదని దాంతో తను కూడా పని చేసేదని చెప్పారు. వాళ్ల సోదరి అమూల్య కూడా వారితో పనులకు వచ్చేదని అన్నారు. ఎప్పుడైన ఇతర పిల్లను తనను ఎగతాళి చేస్తే ఇంటికి వచ్చి ఏడ్చేదని, అప్పుడు తనని సంతోష పెట్టడం కోసం పొంగలి అన్నం, చికెన్ చేసేదని గుర్తుచేసుకున్నారు.
Para Asian Games 2023 : పారా ఆసియా క్రీడల్లో తెలుగు తేజాలు అదరహో.. భారత్ ఖాతాలో పసిడి జాతర!