JC Prabhakar Reddy Protest At Police Station In AP : పోలింగ్ రోజు (మే 13న) జరిగిన అల్లర్లలో తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన బాట పట్టారు. అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. తాడిపత్రి నుంచి 150 వాహనాల్లో అనుచరులతో కలిసి అనంతపురం చేరుకున్నారు.
ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన రాళ్ల దాడి ఘటనల్లో పోలీసులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించారని జేసీ ఆరోపిస్తున్నారు. అదే విధంగా బస్సుల అక్రమ కొనుగోలు కేసులపై ఆధారాలు చూపించాలంటూ జేసీ డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం వన్ టౌన్ పీఎస్‌లో డీఎస్సీని జేసీ ప్రభాకర్‌రెడ్డి కలిసి అక్రమ కేసుల ఆధారాలను సమర్పించారు. డీఎస్పీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో జిల్లా ఎస్పీ మురళీ కృష్ణను కలవడానికి వెళ్లారు.
రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి - High Tension in Tadipatri
రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి - High Tension in Tadipatri