ETV Bharat / state

జేసీ కుటుంబానికి పోలీసుల ఆంక్షలు- 'గృహ నిర్బంధం చేస్తాం’ అంటూ హెచ్చరికలు - JC Family Problems Due to Police - JC FAMILY PROBLEMS DUE TO POLICE

JC Family Problems Due to Police Officers : అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జేసీ సోదరుల ఇంట్లోని పని మనుషులందర్నీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దీంతో జేసీ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది.

jc_family_problems_due_to_police_officers
jc_family_problems_due_to_police_officers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 12:35 PM IST

JC Family Problems Due to Police Officers : అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జేసీ సోదరుల ఇంట్లోని పని మనుషులందర్నీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దీంతో జేసీ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. తాడిపత్రి పట్టణంలోని వారి నివాసంలో నిత్యం వందల మందికి వారు భోజనాలు పెడతారు. అలాంటిది తాడిపత్రి పోలీసుల చర్యల కారణంగా వారికే భోజనం పెట్టేవారు కరవయ్యారు.

JC Family to Hyderabad : ఈనెల 14న తాడిపత్రిలో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి జరిగిన అనంతరం అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణలు మొదలయ్యాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. తాడిపత్రికి వచ్చిన రాజంపేట డీఎస్పీ చైతన్య జేసీ ఇంట్లో పని మనుషులందర్నీ అరెస్టు చేశారు. వారి ఇంటిని ఆధీనంలోకి తీసుకున్నారు. దివాకర్‌రెడ్డి భార్య విజయమ్మ, సోదరి సుజాతమ్మ కొద్దికాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. వీరికి సమయానికి మందులు, భోజనం అందించే సిబ్బందిని మంగళవారం తెల్లవారుజామున డీఎస్పీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన తల్లి, మేనత్తల బాగోగులు చూసుకునేందుకు దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌కుమార్‌రెడ్డి గురువారం తాడిపత్రికి రాగా పోలీసులు ఆయనపై సైతం ఆంక్షలు విధించారు. ‘మీరు తాడిపత్రిలో ఉండకూడదు. ఉంటే గృహ నిర్బంధం చేస్తాం’ అని పోలీసులు హెచ్చరించారు. తనపై ఆంక్షలు విధించడం సరికాదని పవన్‌ వాదించినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. చేసేది లేక కుటుంబ సభ్యులను పవన్‌ హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు.

పోలీసులంతా కలిసి కొట్టారు: జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు కిరణ్​ - POLICE ATTACK ON JC FOLLOWER

ఎన్నికలు ముగిశాక సైతం జరుగుతున్న గొడవలను అదుపు చేయాల్సిన పోలీసులు వాటికి మరింత ఆజ్యం పోస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పని చేసే దివ్యాంగుడు దాసరి కిరణ్​ను బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు డీఎస్పీ చైతన్య ఆదేశాలతో విచక్షణారహితంగా కొట్టిన సంఘటనపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీలతో చావబాదడంతో కిరణ్​కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కిరణ్ తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని తనను డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కొట్టడం దారుణమని బాధితుడు కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాడిపత్రి ఘటనపై డీఎస్పీని మందలించిన ఎస్పీ - అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశం - SP Reprimanded DSP Chaitanya

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.