Jaggery Tea in Armoor : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన బెల్లం టీకి ఆదరణ లభిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే మొట్ట మొదటి బెల్లం ఛాయ్గా పేరు సంపాదించింది. ఆర్మూర్‌కు చెందిన గంగారెడ్డికి మామిడిపల్లిలోనే మెడికల్ షాపు ఉంది. యూట్యూబ్(You tube)లో బెల్లం ఛాయ్ గురించి తెలుసుకున్న అతను మహారాష్ట్రలోని నాసిక్‌కు వెళ్లినప్పుడు స్వయంగా ఛాయ్ తాగి వివరాలు తెలుసుకున్నాడు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేశారని తెలిసి అక్కడున్న స్నేహితునితో కలిసి వెళ్లి ఛాయ్ తాగి పరిశీలించాడు.
Demand for Jaggery Tea in Nizamabad District : సాధారణంగా చక్కెరతో తయారు చేసే టీ ఎక్కడైనా లభిస్తున్నా, బెల్లం టీ మాత్రం అరుదు. అందుకే ఆర్మూర్‌లో ఏర్పాటు చేయాలని భావించాడు. బెల్లం టీ తయారు చేస్తున్న నాసిక్(Nashik)కు చెందిన వారితో మాట్లాడి ఫ్రాంచైజీ తీసుకున్నాడు. బెల్లం సేకరణ, టీ తయారు చేయడం వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. గత నెల ప్రారంభించగా దీని గురించి తెలుసుకుని చాలా మంది వచ్చి బెల్లం టీ తాగి వెళ్తున్నారు. అనారోగ్య కారణాల కారణంగా చక్కెర పదార్థాలను తీసుకునేందుకు చాలా మంది వెనుకంజ వేస్తున్న రోజులివి. షుగర్ వ్యాధిగ్రస్తులు, ఊబకాయం ఉన్న వాళ్లు చక్కెర పదార్థాలను తినాంటేనే భయ పడతారు.
Special Story on jaggery Tea : అయితే చక్కెరకు బదులుగా బెల్లంతో తయారు చేసిన పదార్థాలను కొంత మేర తీసుకుంటారు. అందుకే ఆర్మూర్‌లో గంగారెడ్డి బెల్లం ఛాయ్(Jaggery Tea)ను అందుబాటులోకి తీసుకురాగా స్థానికులు ఇష్టంగా తాగుతున్నారు. బెల్లం ఛాయ్ వల్ల వ్యాధుల సంక్రమణను నియంత్రించడంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. కీళ్లనొప్పులు, రక్తపోటును సైతం అదుపులో ఉంచుతుందని స్థానికులు చెబుతున్నారు. చక్కెర కారణంగా ఛాయ్ తాగలేకపోతున్న అనేక మంది ఈ బెల్లం ఛాయ్ తాగుతున్నారు. ఛాయ్‌ను ఆస్వాదించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నామని చెబుతున్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లంతో తయారు చేస్తున్న ఛాయ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
'షుగర్ వ్యాధి చాలా మందికి వస్తుంది. ఈ క్రమంలో బెల్లం టీ కాన్సెప్ట్ తీసుకుందామని యూట్యూబ్‌లో చూశా. ఇవి మహారాష్ట్ర, నాసిక్, ఆదిలాబాద్, నిర్మల్‌లో ఉంది. దీని కోసం నాసిక్ వెళ్లి చూశా. బాగా అనిపించింది. నిర్మల్‌లో కూడా ఉంది అని ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని టీ తాగినా. మళ్లీ నాసిక్‌కు వెళ్లి అక్కడ నిర్వాహకులతో మాట్లాడి ఆర్మూర్‌కు ఫ్రాంచైజీ తీసుకొచ్చాం. బెల్లం టీ వల్ల లాభాలు చాలా ఉన్నాయి. కస్టమర్స్ కూడా మంచిగా రెస్పాండ్ ఇస్తున్నారు.- 'గంగారెడ్డి, బెల్లం టీ నిర్వాహకుడు.
23 ఏళ్లకే లస్సీ డే కేఫ్ వ్యాపారం- యశ్వంత్ సక్సెస్ జర్నీ సాగిందిలా
సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాల తయారీ - ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరట!