Jagan Govt Name in Adani Case Allegations : వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా న్యూయార్క్‌లో నమోదైన అవినీతి కేసులు ఏపీ మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పేరు నమోదైంది. సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రముఖంగా జగన్ ప్రభుత్వం పేరు పేర్కొంది. భారత్‌లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు రూ.2029 కోట్లు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఒప్పందాలకు లంచం ఇచ్చినట్లు పేర్కొంది. 2019-24 మధ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకు రూ.279 కోట్ల లంచం మూటజెప్పినట్టు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.
వారందరిపై కేసు నమోదు : 2021లో అదానీ వ్యక్తిగతంగా జగన్‌తో భేటీ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జగన్‌తో అదానీ భేటీ తర్వాత డీల్ కుదిరినట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు రాగా 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాలే లక్ష్యంగా లంచాలు ఇచ్చి ఒప్పందాలు జరిపారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్, మరో ఏడుగురిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేశారు.
'అదానీపై వ్యవహారంపై వందల ప్రశ్నలకు సమాధానాలేవీ' - కాంగ్రెస్ తీవ్ర స్పందన - జేపీసీ కోసం డిమాండ్
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందం స్కామ్‌లో జగన్ సర్కారు పేరు వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు 228 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1750కోట్లు) లంచాలను పుచ్చుకొన్నట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది. ఈ స్కామ్ మొత్తం 2019-24 మధ్య చోటు చేసుకోగా.. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అభియోగాల ప్రకారం.. 2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. నాడు విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. రూ.2.49కు యూనిట్ చొప్పున 2.4 గిగావాట్ల కొనుగోలుకు 25 ఏళ్లపాటు వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గుజరాత్‌లో మాత్రం రూ. 1.99కే సెకీ ద్వారా విక్రయించేందుకు అదానీ పవర్ డీల్ కుదుర్చుకున్నట్లు ఎఫ్‌బీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
అమెరికా ఆరోపణల ఎఫెక్ట్- భారీ నష్టాల్లో అదానీ కంపెనీల స్టాక్స్- రూ.2.45 లక్షల కోట్లు ఆవిరి
ఏడాదిలో రూ.2,153కోట్లు విరాళం- దాతృత్వంలో శివ్ నాడార్దే అగ్రస్థానం- అంబానీ, అదానీ లెక్క ఇలా!