Jagadish Reddy Fires On Komati Reddy Brothers : కోమటి రెడ్డి బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరుతోనే బీఆర్ఎస్, కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సుల కోసం అన్నదమ్ములిద్దరూ ఆరాటపడుతున్నారని అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు వెళ్తానని తెలిపారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లేదని చెప్పారు. జిల్లాకు పట్టిన శని కోమటి రెడ్డి బ్రదర్స్ అని కాంగ్రెస్ హయాంలో ఇద్దరు కలిసి నల్లగొండ జిల్లా అన్నదాతలను మోసం చేశారన్నారు.
వసూళ్లపై ఉన్నంత శ్రద్ద ప్రభుత్వానికి రైతుల సమస్యలపై లేదు : జగదీశ్ రెడ్డి
Jagadish Reddy Fires On congress : సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, కమలం పార్టీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీకులు ఇస్తున్నారని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, లీకు, ఫేక్ కథనాలతో కాలం గడుపుతోందని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండంకెల సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృత దేహానికి నివాళులు అర్పించిన జగదీశ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
"గత కాంగ్రెస్ హయాంలో కోమటి రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కలిసి నల్లగొండ జిల్లా అన్నదాతలను మోసం చేశారు. బీజేపీని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించట్లేదు. అన్ని సభల్లో రేవంత్ రెడ్డి మోదీని పొగుడుతున్నారు. బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి చేరుతారు. కాంగ్రెస్ నాయకులే చెపుతున్నారు. గతంలో తెలంగాణ గురించి ఉద్యమం చేశాం. ఇప్పుడు కూడా ప్రజల గురించి జైలుకు వెళ్లడానికి సిద్ధం." జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
నిన్న జరిగిన నల్గొండ సభలో కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు చేశారు. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టించి వారికి స్వాగతం పలుకుతామని చెప్పారు. రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటే ఏంటో చూస్తారంటూ హెచ్చరించడంతో స్పందించిన జగదీశ్ రెడ్డి ఇవాళ ప్రతి విమర్శలు చేశారు.
కాంగ్రెస్ హామీలు నీటి బుడగలే అని అర్థం అవుతోంది : జగదీశ్‌రెడ్డి - ex minister Jagadish Reddy