ETV Bharat / state

'రేవంత్ రెడ్డికి వసూళ్ల మీద ఉన్న సోయి రైతుల మీద లేదు - ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకే కేసీఆర్​ పంటల పరిశీలన' - Jagadish Reddy on Drying crops - JAGADISH REDDY ON DRYING CROPS

Jagadish Reddy on Drying Crops : సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు వసూళ్ల మీద ఉన్న సోయి పరిపాలన మీద లేదని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నల్గొండ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. పంటలు ఎండుతున్న రైతుల ఆవేదనలు ప్రభుత్వానికి కనబడటం లేదని, చివరి దశలో ఉన్న పంట సాగుకు నీటి విడుదలపై చేతులెత్తేశారని దుయ్యబట్టారు.

Jagadish Reddy fires Congress
Jagadish Reddy on Drying Crops
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 9:54 PM IST

Jagadish Reddy on Drying Crops : బీఆర్ఎస్ పార్టీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న కోపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చూపుతోందని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి (Jagadish Reddy) దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చేయబోయే నల్గొండ పర్యటన సందర్బంగా పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య : మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి

ఈ సందర్భంగా జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ గతంలో నాగార్జుసాగర్​లో ప్రస్తుతం నీటిమట్టం కన్నా తక్కువ నీరు ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేశామని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth reddy) వసూళ్ల మీద ఉన్న సోయి పరిపాలన మీద లేకుండా పోయిందన్నారు. రైతు సమస్యలపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Jagadish Reddy fires Congress : రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు అక్రమ వసూళ్ల దందాలు మొదలుపెట్టి, మిల్లర్లనూ బెదిరిస్తూ రూ.కోట్లు పోగు చేస్తున్నారని జగదీశ్​రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వసూలు చేసిన సొమ్మునంతా దిల్లీకి తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ఒక్క మంత్రి కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం లేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి వారు ఉంటే భూమి, ఆకాశాన్ని ఒక్కటి చేసైనా రైతులను ఆదుకునేవారన్నారు.

రాష్ట్రంలో దరిద్రమైన ప్రభుత్వం పాలనలో ఉందని, తీవ్రంగా కరవు ఏర్పడి వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని జగదీశ్​రెడ్డి ఎద్దేవా చేశారు. కర్షకుల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని, ప్రభుత్వంలో చలనం రావడానికి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన చేస్తున్నారన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించి, అక్కడి నుంచి సాగర్ ఎడమ కాలువ ప్రాంతాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించనునట్లు తెలిపారు.

"సీఎం రేవంత్ రెడ్డికి వసూళ్ల మీద ఉన్న సోయి పరిపాలన మీద లేదు. పంటలు ఎండుతున్న రైతుల ఆవేదనలు ప్రభుత్వానికి కనబడటం లేదు. చివరి దశలో ఉన్న పంట సాగుకు నీటి విడుదలపై చేతులెత్తేశారు. గతంలో నాగార్జుసాగర్​లో ప్రస్తుత నీటి మట్టం కన్నా తక్కువ నీరు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేశాం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు". - జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి

సీఎం రేవంత్​రెడ్డికి వసూళ్ల మీద ఉన్న సోయి రైతుల పొలాల మీద లేదు : జగదీశ్​రెడ్డి

కాంగ్రెస్​కు పాలన చేతకాకపోతే కేసీఆర్​ను అడగండి : జగదీశ్​ రెడ్డి

సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ : జగదీశ్ ​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.