ETV Bharat / state

ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు - సెల్​ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం - IT searches at MLC Kavitha house

ED Raids at MLC Kavitha's House : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఆమె నివాసంలో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

MLC Kavitha
IT searches at MLC Kavitha's house
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 2:49 PM IST

Updated : Mar 15, 2024, 4:23 PM IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

ED Raids at MLC Kavitha's House : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 8 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. సోదాల సందర్భంగా ఇంట్లో ఉన్న అందరి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కవిత వాంగ్మూలం నమోదు చేశారు. అంతకుముందు దాడుల నేపథ్యంలో బీఆర్​ఎస్​ లీగల్​ కన్వీనర్ సోమ భరత్, లాయర్లు కవిత నివాసానికి చేరుకోగా, అధికారులు ఆమె ఇంట్లోకి ఎవరినీ అనుమతించ లేదు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కవిత నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

IT Raids at MLC Kavitha's House : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ గతంలో జారీ చేసిన నోటీసులను సవాల్​ చేస్తూ​ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో కోరారు. ఈ పిటిషన్​పై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు విచారించింది. నేడూ విచారణకు రాగా, ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఇంతలోనే ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేయడం గమనార్హం.

ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ : ఇదిలా ఉండగా బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోశ్​కుమార్, ప్రశాంత్ రెడ్డిలు ఆయనతో భేటీ అయ్యారు. కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Mar 15, 2024, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.