ETV Bharat / state

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ - శ్రీహరికోట నుంచి ఇస్రో వందో ప్రయోగం విజయవంతం - ISRO 100TH MISSION HIGHLIGHTS

ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతం - ఎన్‌వీఎస్‌-2 నేవిగేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌15 - భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవలకు ఉపగ్రహం దోహదం

ISRO successfully launches NVS Zero Two satellite
ISRO successfully launches NVS Zero Two satellite (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 1:36 PM IST

ISRO successfully launches NVS Zero Two satellite : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీహరికోటలో షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని(శాటిలైట్​)ను తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.

ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. ఈ శాటిలైట్​ బరువు 2,250కిలోలు. ఈ ఎన్​వీఎస్​-02 కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు. ముఖ్యంగా భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌ సేవల కోసం ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, స్మార్ట్​ ఫోన్​లలో లోకేషన్‌ ఆధారిత సేవలందించనుంది.

ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది: ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్‌ నారాయణన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని ఆయన తెలిపారు. నావిగేషన్‌ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లుగా వివరించారు. ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని నారాయణన్​ పేర్కొన్నారు.

ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందిస్తుందని ఇస్రో ఛైర్మన్​ నారాయణన్​ పేర్కొన్నారు. విక్రమ్‌ సారాబాయ్‌ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగిందన్నారు. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్‌ వెహికిల్స్‌ అభివృద్ధి చేశామని వెల్లడించారు. 1979లో అబ్దుల్‌ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగిందన్న ఆయన ఇప్పటివరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయని వెల్లడించారు. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపినట్లుగా తెలిపారు. 3 చంద్రయాన్‌, మాస్‌ ఆర్బిటర్‌, ఆదిత్య, ఎస్‌ఆర్‌ఈ మిషన్లు చేపట్టామని’ నారాయణన్‌ తెలిపారు.

ఇస్రోకు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ : ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైన వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 'ఇస్రో విజయం దేశానికి గర్వకారణం' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం

మరో రికార్డ్​కు అడుగు దూరంలో ఇస్రో- శ్రీహరికోట వేదికగా 100వ ప్రయోగానికి కౌంట్​డౌన్ స్టార్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.