ETV Bharat / state

ఇస్రో మరో ఘనత - SSLV-D3 రాకెట్​ ప్రయోగం విజయవంతం - ISRO SSLV D3 Launched Successfully - ISRO SSLV D3 LAUNCHED SUCCESSFULLY

ISRO SSLV D3 EOS 8 Launched Successfully : శ్రీహరికోట షార్‌లో జరిగిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది. మొత్తం 17 నిమిషాలపాటు ప్రయోగం సాగింది. ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈవోఎస్‌-08ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.

ISRO SSLV D3 EOS 8 Uses
ISRO SSLV D3 EOS 8 Launched Successfully (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 12:17 PM IST

Updated : Aug 16, 2024, 12:54 PM IST

ISRO SSLV D3 EOS 8 Launched Successfully : ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ ప్రకటించారు. ఈ మేరకు శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 17 నిమిషాలపాటు ఈ ప్రయోగం కొనసాగింది.

ISRO SSLV D3 EOS 8 Uses : పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలను ఈవోఎస్‌-08 పర్యవేక్షించనుంది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఈవోఎస్‌ను (Earth Observation Satellite) అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ (EOIR) పేలోడ్‌ మిడ్‌-వేవ్, లాంగ్‌ వేవ్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యాప్చర్‌ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది.

శాస్త్రవేత్తలకు సీఎం చంద్రబాబు అభినందనలు : ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందన్న సీఎం, ఇస్రో బృందం భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Last Updated : Aug 16, 2024, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.