IRCTC Bharat Gaurav Travel Train From Secunderabad : రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మరో భారత్ గౌరవ్ పర్యాటక రైలు అందుబాటులోకి రాబోతుంది. ఈ మేరకు తాజాగా ‘మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర’ రైలును ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం, వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయం, అన్నపూర్ణాదేవి, కాశీ విశాలాక్షి, అయోధ్యలోని రామ మందిరం, హనుమాన్ ఆలయాలను దర్శించుకునేలా ఈ పర్యాటక ప్యాకేజీని రూపొందించారు. రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు కాజీపేట, జనగామ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, డోర్నకల్, మధిర, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, తుని, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్ల్లో ప్రయాణికులు ఎక్కి, దిగేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
సుమారు ఎనిమిది రోజులపాటు ఈ యాత్ర జరుగుతుంది. బుకింగ్‌లు, ఇతర సమాచారం కోసం https://www.irctctourism.comను చూడాలని లేదా 9701360701, 9281495845, 040-27702407 నంబర్లలో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ఈ యాత్ర జనవరి 19న ప్రారంభమయ్యే అదే నెల 26న ముగుస్తుందని తెలిపింది. ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధర రూ.22 వేల 635, సెకండ్ ఏసీ రూ.38, వేల 195, థర్డ్ ఏసీ రూ.31, వేల 145 అని వివరించింది. ఇప్పటికే అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్రకు ద.మ.రైల్వే భారత్ గౌరవ్ రైలును నడిపిస్తోంది. 26వ భారత్ గౌరవ్ పర్యాటక రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బుధవారం బయల్దేరి వెళ్లింది.
శబరిమలకు మరో 26 ప్రత్యేక రైళ్లు : మరోవైపు శబరిమల అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకుని కేరళ రాష్ట్రానికి మరో 26 ప్రత్యేక రైళ్లు(13 జతలు) నడిపిస్తున్నట్లు ద.మ.రైల్వే ఈ నెల 11న ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ 26 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. సికింద్రాబాద్ నుంచి కొల్లం(07175)కు జనవరి 2, 9, 16 తేదీల్లో రైళ్లు బయల్దేరుతాయని వివరించింది. తిరిగి కొల్లం నుంచి సికింద్రాబాద్ (07176)కు జనవరి 4, 11, 18 తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే కాకినాడ-కొల్లం, కొల్లం-కాకినాడ, విజయవాడ-కొల్లం, కొల్లం-విజయవాడ, నర్సాపూర్-కొల్లం, కొల్లం-నర్సాపూర్, గుంటూరు-కొల్లం, కొల్లం-గుంటూరు రూట్లలో 20 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపించనున్నట్లు తెలిపింది.
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్ - జవవరిలో శబరిమలకు అదనంగా 34 రైళ్లు - ఆ వివరాలివిగో