Telangana In Irrigation Projects : గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. నీటి నిలువలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షపు నీరుతో పాటుగా పై నుంచి వచ్చే వరద నీరుతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కడెం, జూరాల, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జలశయాలకు భారీగా నీరుచేరుతుంది.
నిర్మల్ జిల్లా కడెం జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో ఎడతెరపి లేని వర్షాలకు జలాశయంలో వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టులోకి 10వేల488 క్యూసెక్కుల నీరు చేరుతుందిం. దీంతో అధికారులు రెండు వరద గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 692 అడుగులకు చేరుకుంది.
జూరాల జలాశయానికి భారీగా వరద ప్రవాహం ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.96 లక్షల క్యూసెక్కులు ఉండగా, జలశయా 42గేట్ల ద్వారా 1.92 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. జారాల పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.66 మీటర్లుకు చేరుకుంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 6.18 టీఎంసీలకు చేరినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
బొగత జలపాతంలో ఈతకు వెళ్లి యువకుడు మృతి - Man Died at Bogatha Waterfalls
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం జలాశయం నుంచి 14100 క్యూసెక్కుల వరద నీరు, వాగులు వంకలు పొంగి 11వేల 36 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుంత 13.53 నీటి నిలువలు టిఎంసిలకు చేరుకున్నాయి. 148 మీటర్లుకు గాను 145.40 మీటర్ల ఎత్తుకు వరద నీరు చేరినట్లు అధికారులు తెలిపారు.
నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ జలాశయానికి 18,894 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, నీరు ప్రస్తుతం 1071.50 అడుగులకు చేరుకుంది. శ్రీరాంసాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 80.5 టీఎంసీలు కాగా, 25.96 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది.
నిజాంసాగర్‌కు వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతునే ఉంది. ప్రాజెక్టుకు 850 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. నిజాంసాగర్ పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిలువలు 1,388.32 అడుగులకు చేరుకున్నాయి. ఈ జలశయ నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 3.41 టీఎంసీల నిలువ ఉన్నట్లు అధికారులు తెలిపారు.