ETV Bharat / state

వరద మిగిల్చిన దుస్థితి - ఒక్కో వాహనాన్ని బయటకు తీసేందుకు రూ.20 వేలు ఖర్చు - Flood Level Recedes in AP - FLOOD LEVEL RECEDES IN AP

Flood Level Recedes in AP : వరద ఉద్ధృతి తగ్గడం వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముంపునకు గురైన గ్రామాలు క్రమంగా కోలుకుంటున్నాయి. వరద ప్రవాహానికి అనేకచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ సహాయ చర్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు మాట్లాడి ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.

Lingala Bridge Washed away by Munneru Flood Surge in AP
Krishna River Munneru Flood Receded (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 9:59 PM IST

Krishna River Munneru Flood Receded : ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి కృష్ణాజిల్లాలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద మిగిల్చిన నష్టాన్ని చూసి రైతులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరు వరద ఉద్ధృతికి లింగాల వంతెన కొట్టుకుపోయింది. కిలోమీటర్ పొడవైన వంతెనపై పలుచోట్ల భారీగండ్లు ఏర్పడ్డాయి. కాంక్రీట్ స్లాబులూ కోతకు గురయ్యాయి. దీంతో జగ్గయ్యపేట నుంచి ఖమ్మంకు రాకపోకలు నిలిచిపోయాయి.

జగ్గయ్యపేట-ముత్యాల రహదారిలోని పాలేటి వంతెనపై వరద ప్రవాహానికి భారీ రంధ్రాలు ఏర్పడ్డాయి. వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద వైరా కట్టలేరు వరద ఉద్ధృతికి రహదారులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ నుంచి మున్నేరుకు వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో ఐతవరం వద్ద పొలాల్లో కొట్టుకుపోయిన కార్లు, వాహనాలు బయటపడుతున్నాయి. ఒక్కో వాహనాన్ని బయటకు తీసేందుకు రూ.20 వేల వరకు ఖర్చవుతుందని యజమానులు వాపోతున్నారు.

Roads Eroded Due to Flood Flow : నందిగామ మండలం కంచల గ్రామానికి వెళ్లే రోడ్డు కొంత భాగం కొట్టుకుపోయింది. రాఘవపురంలో రోడ్డు మొత్తం కోతకు గురైంది. వరి పొలాలు నీట మునిగాయి. చందర్లపాడు మండలం చింతలపాడుకు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. భారీగా వరద నీరు రావడంతో తోటరావులపాడు నుంచి చింతలపాడు వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. గంపలగూడెం మండలం వినగడప వంతెన వద్ద కట్టలేరుకు వరద ప్రవాహం ఉద్ధృతిగా సాగుతోంది.

కంచికచర్ల మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని తెలుగుదేశం నేత నెట్టెం రఘురాం సందర్శించారు. ఆహార ఏర్పాట్ల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 10 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. వరదలకు దివిసీమలో వాణిజ్య, ఆక్వాపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో అరటి, కంద, పసుపు, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి.

సహాయ చర్యల్లో నిమగ్నమైన అధికారులు, ప్రజాప్రతినిధులు : అవనిగడ్డ నియోజకవర్గంలో 10 పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. దివిసీమలో సుమారు 10 చోట్ల కరకట్టపై వరద నీరు రావడంతో ఇసుక బస్తాలు వేసి పటిష్ట చర్యలు చేపట్టారు. కృష్ణానది వరద ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి. బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

కొల్లూరు కరకట్ట వద్ద వరద ఉద్ధృతిని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు, జిల్లా కలెక్టర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, ఎస్పీ తుషార్ దూడీ సందర్శించారు. వరద ఉద్ధృతి తగ్గిన వెంటనే నష్ట పరిహారం అంచనా వేసి బాధితులను ఆదుకుంటామని మంత్రులు తెలిపారు. రేపల్లె మండలం పెనుమూడి వద్ద పునరావాస కేంద్రాన్ని మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. జలదిగ్బంధమైన పల్లెపాలెం నిర్వాసితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బుడమేరు వరదలో వాహనాలు - పెద్ద సంఖ్యలో నీటమునిగిన కార్లు! - Vehicles Stuck in Flood Water

జేసీబీలో చంద్రబాబు - డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా - AP CM Visits Flood Areas

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.