ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు - పాల్గొన్న రాజకీయ ప్రముఖులు - Yoga Day In Telangana 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 12:59 PM IST

Updated : Jun 21, 2024, 1:06 PM IST

International Yoga Day Celebrations 2024 : పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు యోగాసనాలు వేశారు. యోగాను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని, నిత్యం అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనిషి జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని అన్నారు.

International Yoga Day Celebrations in Telangana 2024
International Yoga Day Celebrations 2024 (ETV Bharat)

International Yoga Day Celebrations in Telangana 2024 : ప్రపంచ దేశాలకు యోగా మార్గదర్శకంగా నిలుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్​లో అటల్ బిహారీ వాజ్​పేయి ఫౌండేషన్, నిజాం కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో యోగ మహోత్సవం దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యాతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత యోగా ఘనతని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరైన యోగ సాధకులు పలు ఆసనాలు ప్రదర్శించారు. కిషన్ రెడ్డి సహా రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా యోగాసనాలు వేశారు. యోగ శరీరాన్ని మనసును ఏకం చేస్తుందని, ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ నేనని, ప్రతి ఒక్కరూ సాధన చేయాలని కిషన్ రెడ్డి కోరారు.

Telangana Governor on Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్​లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ మున్సిపల్ గ్రౌండ్​లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బండి సంజయ్​ పాల్గొన్నారు. పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా వ్యక్తులు, సమాజ ఆరోగ్యానికి దోహద పడుతుందన్నారు. మన సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించడానికి యోగా అపారమైన సామర్థ్యాన్ని ఇస్తుందన్నారు.

యోగాతో మానసిక ఆరోగ్యం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని సంజీవయ్య పార్కులో 10వ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆరోగ్యకర తెలంగాణ నిర్మాణంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. యోగా వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు.

ఆరోగ్యకర తెలంగాణ నిర్మాణంలో 'యోగా'ది ప్రముఖ పాత్ర : మంత్రి దామోదర

ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక రెవెన్యూ గార్డెన్​లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యోగా గురువు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌, ఎమ్మెల్యే యోగాసనాలు వేశారు. వీరితో పాటు నర్సింగ్ కళాశాల విద్యార్థులు, యువకులు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో యోగాలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు యోగ ఆసనాలు వేసి ప్రదర్శించారు. మిరుదొడ్డి మండలం అల్వాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు పలు యోగాసనాలు వేసి పలువురిని ఆకట్టుకున్నారు.

Yoga Day at Medak : మెదక్ జిల్లా నర్సాపూర్ కోర్టు ఆవరణలో జడ్జ్ అనిత, యోగా గురుజి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు ఇందుకోసం ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు. ఈ యోగా కార్యక్రమానికి బాలికలు, మహిళలు, న్యాయవాదులు కోర్టు సిబ్బంది హాజరయ్యారు.

యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా? రోజూ ఆసనాలు వేస్తే బోలెడు హెల్త్ ​బెనిఫిట్స్​! - International Yoga Day 2024

yoga day celebrations in khammam : ఖమ్మంలో యోగా దినోత్సవం.. పాల్గొన్న కలెక్టర్​ గౌతమ్​

Last Updated : Jun 21, 2024, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.