ETV Bharat / state

మత్తువదలరా - డ్రగ్స్ మహమ్మారిపై కదం తొక్కిన తెలంగాణ - Anti Drug Rally in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 1:21 PM IST

Updated : Jun 26, 2024, 2:51 PM IST

International Day Against Drug Abuse : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పలు కళాశాల నిర్వాహకులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మత్తు పదార్ధాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని ప్లకార్డులు ప్రదర్శించారు.

Anti Drug Awareness Rally in Telangana
Rally on the occasion of Anti-Drug Day (ETV Bharat)

Anti Drug Awareness Rally in Telangana : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పలు జిల్లాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో ఎస్పీ అశోక్‌ కుమార్‌ ర్యాలీని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బస్టాండ్‌ నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఎవరైనా డ్రగ్స్‌ అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఏసీపీ కిషోర్‌కుమార్‌ హెచ్చరించారు. హనుమకొండలో అదనపు కలెక్టర్‌ రాధిక గుప్తా ఆధ్వర్యంలో అదాలత్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట డ్రగ్స్ మహమ్మారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహబూబాబాద్‌లో కాళోజీ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Anti Drug Abuse Rally in mahabubabad : జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత మత్తులో చిత్తవుతున్నారని, మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డ్రగ్స్​ను విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మంచిర్యాలలోని ఐ.బీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీని జిల్లా పాలనాధికారి దీపక్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వివిధ శాఖల ఆద్వర్యంలో విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ర్యాలీ నిర్వహించారు. ఎన్​టీఆర్ మినీస్టేడియంలో మాదక ద్రవ్యాల నిరోదక పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రధానంగా విద్యార్థులు మాదకద్రవ్యాల వినోయోగంపై ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, వాటి నుంచి దూరంగా ఉండాలని సూచించారు. మత్తుకు అలవాటు పడ్డవారు మంచి భవిష్యత్తును కోల్పోతారని అన్నారు.

International Day Against Drug Abuse : ఆదిలాబాద్‌లో ఎస్పీ ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. మరోవైపు మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వరంలో మత్తు పదార్థాల అవగాహన ర్యాలీ చేశారు.

పోలీసులు మాత్రమే డ్రగ్స్ కంట్రోల్ చేయలేరు - ప్రజలూ సహకరించాలి : భట్టి విక్రమార్క - BHATTI VIKRAMARKA ON DRUGS SUPPLY

మహిళలే టార్గెట్​గా డ్రగ్స్ దందా - స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలుగా యువత - girls TARGETED BY DRUG GANGS

Last Updated : Jun 26, 2024, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.