ETV Bharat / state

మహిళలను కోటీశ్వరులను చేసే 'ఇందిరా శక్తి పథకం' - ఎప్పటినుంచంటే?

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేలా సరికొత్త పథకం - త్వరలోనే ప్రజల్లోకి తీసుకొస్తామన్న మంత్రి శ్రీధర్​ బాబు

Minister Sridhar Babu On Indira Mahila Shakti scheme
Minister Sridhar Babu On Indira Mahila Shakti scheme (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2024, 3:00 PM IST

Minister Sridhar Babu On Indira Mahila Shakti scheme : తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్‌ ప్రగతినగర్‌లోని ఎలీప్‌ మహిళా పారిశ్రామికవాడ ఎస్టేట్‌లో ఎంఎస్‌ఎంఈ డిఫెన్స్‌ కాన్‌క్లేవ్‌’ అంశంపై శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

త్వరలోనే ప్రజల్లోకి ఇందిరా మహిళా శక్తి పథకం : ఇందిరా మహిళా శక్తి పథకానికి ఇప్పటికే రూపకల్పన పూర్తయిందని శ్రీధర్ బాబు వెల్లడించారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకొస్తామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో రక్షణశాఖకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి వారికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. సుదీర్ఘకాలంగా మహిళాభ్యున్నతికి ఎలీప్‌ చేస్తున్న కృషి అభినందనీయని ప్రశంసించారు.

డిజిటల్ స్టూడియోను ప్రారంభించిన మంత్రి : అంతకుముందు అంకుర సంస్థల(స్టార్టప్స్​) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి, నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ స్టూడియోను శ్రీధర్​ బాబు ప్రారంభించారు. ఎలీప్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు సుఖ్‌గీత్‌కౌర్, పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ డైరెక్టర్‌ డాక్టర్‌ నజీర్‌ జమల్, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మస్లూర్, ఏరో స్పేస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రవీణ్, మిధాని ఛైర్మన్, ఎండీ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఝా, ఎలీప్‌ కార్యదర్శి పద్మజా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు : రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిసారించింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ)లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి నిలదొక్కుకునే విధంగా చేయాలనేదే ప్రభుత్వ సంకల్పం. రాష్ట్ర జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 10శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నూతనంగా నమోదయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏటా 15శాతానికి పెంచాలని నిశ్చయించుకున్నారు. దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆర్థిక వృద్ధి, ఉత్పాదక పెరుగుతుందని, సాంకేతికత విరివిగా అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ చెబుతోంది.

'ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు' : హరీశ్​రావుపై శ్రీధర్​బాబు సీరియస్

మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం : శ్రీధర్‌బాబు - Minister Sridhar Babu Inaugurates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.