ETV Bharat / state

డిగ్రీ ఉంటే చాలు ఐఐటీ​లో జాబ్​కు అర్హులే! - చివరి తేదీ ఎప్పుడంటే ? - IITH RECRUITMENT 2024

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్​లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు - డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన ఐఐటీహెచ్‌ - చివరి తేదీ ఎప్పుడంటే ?

NON TEACHING JOBS IN IIT HYDERABAD
Non Teaching Post in IITH (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 2:58 PM IST

Updated : Oct 28, 2024, 3:45 PM IST

Non Teaching Posts in IITH : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌)లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 31 నాన్‌ టీచింగ్‌ పోస్టుల్లో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌కు ఒక పోస్టు, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌-1, జూనియర్‌ సైకలాజికల్‌ కౌన్సెలర్‌ (మేల్‌)-1, టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ - కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌-1, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌-3, ఫిజియోథెరపిస్ట్‌ (మేల్‌)-1, స్టాఫ్‌ నర్స్‌-5, జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-2, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌- కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌-1, జూనియర్‌ టెక్నీషియన్‌-13, అకౌంటెంట్‌కు రెండు పోస్టులు ఉన్నాయి.

ఖాళీలున్న పోస్టుల వివరాలు

ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌-3 : ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో 55 శాతం మార్కులు ఉండాలి. లేదా మాస్టర్స్​ డిగ్రీ/ తత్సమాన పరీక్ష 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. స్టోర్స్‌ అండ్‌ పర్చేస్‌ / ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ / అడ్మినిస్ట్రేషన్‌ /అకడమిక్‌ / హెచ్‌ఆర్‌ / లీగల్‌ సర్వీసెస్‌/ ఆర్‌అండ్‌డీ /హాస్టల్స్‌ / మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు లేదా ప్రముఖ ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసి ఉండాలి.

స్టాఫ్‌నర్స్‌-5 : స్టాఫ్‌నర్స్‌ కోసం నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. స్టాఫ్‌నర్సుగా కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. ప్రముఖ ఆసుపత్రులో ఐదేళ్లు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. నర్సింగ్‌ కౌన్సిల్‌లో నమోదవ్వాలి. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో నియో నాటల్, ఐసీయూ, న్యూబోర్న్‌కేర్‌, వాక్సినేషన్​లో అనుభవమున్న వారికి ప్రాధాన్యమిస్తారు.

జూనియర్‌ టెక్నీషియన్‌-13 : సీఎస్‌ఈ / ఈసీఈ / ఈఈ /ఐటీతో బీఈ / బీటెక్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసై ఉండాలి. సర్వర్​ మేనేజ్​మెంట్​లో కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. నెట్‌వర్కింగ్, లినక్స్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్, హై పర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ (హెచ్‌పీసీ), నెట్‌వర్కింగ్‌ ఫైల్‌ సిస్టమ్, షెల్‌ స్క్రిప్టింగ్‌ పరిజ్ఞానం ఉండాలి. స్వతంత్రంగా పనిచేయగలవారికి ప్రాధాన్యం ఇస్తారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సెంట్రల్‌ వర్క్‌షాప్, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సెంటర్‌ (నెట్వర్కింగ్‌), కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ డివిజన్, కంప్యూటర్‌ సెంటర్‌ (ఐటీ సపోర్ట్‌), మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ అండ్‌ ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ లేదా డిప్లొమాలో పాసై ఉండాలి. డిగ్రీ పాసైనవారికి రెండేళ్లు, డిప్లొమా చేసినవారికి ఐదేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి.

వయసు : సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ పోస్టులకు 50 ఏళ్లు, పీఆర్‌వో పోస్టులకు 45 ఏళ్లు, టెక్నికల్‌ సూపరింటెండెంట్‌/ జేపీసీ పోస్టులకు 40 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు. ఐఐటీ, హైదరాబాద్‌ ఉద్యోగులకు అయితే గరిష్ఠ వయసు లేదు.

దరఖాస్తు ఫీజు : రూ.500. ఎస్టీ, ఎస్సీ, మహిళలకు, దివ్యాంగులకు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.

ఎంపిక : రాత పరీక్ష/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ / స్కిల్‌ టెస్ట్‌ / ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులో తెలియజేసిన వివరాల ప్రకారం అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేసి టెస్ట్ ​/ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. పోస్టుల ఆధారంగా రాతపరీక్ష / స్కిల్‌ టెస్ట్​ / ప్రొఫిషియన్సీ టెస్టులను నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ : 10.12.2024

వెబ్‌సైట్‌ : http://www.iith.ac.in/ss

Last Updated : Oct 28, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.