ETV Bharat / state

'తప్పుడు క్లెయిమ్​లు నమోదు చేసి పన్ను ఎగ్గొట్టాలని చూస్తే ఎప్పటికైనా చర్యలు తప్పవు' - Awareness on Income Tax - AWARENESS ON INCOME TAX

Awarness on Tax Payments : తప్పుడు​ క్లెయిమ్​లు నమోదు చేసి ఆదాయపన్ను మినహాయింపులు పొందాలనుకుంటే భవిష్యత్​లో అయినా చర్యలు తప్పవని ఇన్​కమ్​ ట్యాక్స్‌ హైదరాబాద్ రేంజ్‌-5 అడిషనల్‌ కమిషనర్ పి.సుమిత హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్​లో బంజారాహిల్స్​లోని ఆదాయపన్నుపై అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు అంశాలను వివరించారు.

AWARENESS PROGRAM ON TAX
Income Tax Addl Commissioner on Tax (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 7:04 PM IST

Income Tax Addl. Commissioner on Tax : తప్పుడు క్లెయిమ్​లు నమోదు చేసి ఆదాయపన్ను మినహాయింపులు పొందాలనుకుంటే భవిష్యత్‌లో చిక్కులు తప్పవని ఇన్​కమ్​ ట్యాక్స్‌ హైదరాబాద్ రేంజ్‌ -5 అడిషనల్‌ కమిషనర్ పి. సుమిత హెచ్చరించారు. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లింపు, మినహాయింపు మార్గాలు, జత చేయాల్సిన ధ్రువపత్రాల్లో అవకతవకలకు పాల్పడితే విధించే జరిమానాలు తదితర అంశాలపై హైదరాబాద్​లో బంజారాహిల్స్​లోని లారస్‌ ల్యాబ్‌ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆదాయపన్ను శాఖ అడిషనల్‌ కమిషనర్ సుమిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులకు అడిషనల్‌ కమిషనర్ సుమితతో పాటు చార్టెర్డ్ అకౌంటెంట్ ఎన్.రామకృష్ణ శాస్త్రి పలు అంశాలను వివరించి అవగాహన కల్పించారు.

AWARENESS ON ITR FILING
ఆదాయపన్ను అవగాహన కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు (ETV Bharat)

ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో గతేడాది నుంచి ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సుమిత తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమ అడ్రస్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను ఇన్​కమ్​ ట్యాక్స్‌ ఇండియా లేదా ఈ-ఫైలింగ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఆదే విధంగా అడ్రస్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ మారితే విధిగా అప్డేట్ చేయాలని సూచించారు. పన్ను ఎగవేసేందుకు ఆదాయ వివరాలు దాచిపెట్టినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు, బ్యాంక్ స్టేట్​మెంట్లు, కెడ్రిట్, డెబిట్ కార్డులు, వాహనాలు కొనుగోలు ఇలా అన్ని రకాలుగా ఐటీ అధికారులకు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు.

AWARENESS ON ITR FILING
ఆదాయపన్నుపై అవగాహన కల్పిస్తున్న ఆ శాఖ అడిషనల్‌ కమిషనర్ సుమిత (ETV Bharat)

ఆధార్​తో పాన్​కార్డు​ లింక్​ చేయాలి : ఏవైనా తేడాలు ఉంటే పదేళ్ల తర్వాత కూడా చర్యలు తప్పవని సుమిత హెచ్చరించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పన్ను చెల్లింపుదారులు సాధారణంగా చేస్తున్న పొరపాట్లు తదితర అంశాలపై ఎన్.రామకృష్ణ శాస్త్రి సూచనలు చేశారు. ఐటీ శాఖ నుంచి వచ్చే నోటీసులకు విధిగా స్పందించాలని, సకాలంలో స్పందించకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆధార్ కార్డును పాన్ నంబర్‌ను లింక్ చేయకపోతే అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని, అర్హతలేని రిటర్న్​లు క్లెయిమ్ చేయొద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్​కమ్​ ట్యాక్స్ హైదరాబాద్ సర్కిల్-5 అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాస్, లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సీహెచ్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆదాయ పన్ను రేట్లలో కీలక మార్పు- స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలకు పెంపు - Budget 2024 Income Tax Changes

ఇంకా ITR ఫైల్ చేయలేదా? గడువు ముంచుకొస్తోంది - త్వరపడండి! - ITR Filing 2024 Deadline

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.