ETV Bharat / state

సమర్థ నిర్వహణతోనే జలసంరక్షణ - నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవే! - Rain Water Harvesting Tips

Rain Water Harvesting Tips : సాధారణంగా మే మాసం అంటే ఎండలు దంచికొడతాయి. బయటకు వెళితే మాడు పగిలే ఎండ, ఇంట్లో ఉంటే ఉక్కపోత అన్నట్లు ఉంటుంది పరిస్థితి. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా మారిపోయింది. ఎండలు మాయమై వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదంగా మారిపోయింది. ఇంత వరకు బాగానే ఉంది. మరి కురుస్తున్న వానను ఒడిసిపట్టడమే సమస్యగా మారింది. వాన నీటి సంరక్షణ నీటి మూటగా మిగిలింది. బెంగళూరు లాంటి అనుభవాలు ఎదురవుతున్నా జల సంరక్షణలో ఎప్పుడూ నిర్లక్ష్యమే. వాననీటిని వృథాగా వదిలేయడం, నీటి కోసం అల్లాడడం. ఇదీ పరిస్థితి. మరి పక్షం రోజుల్లో వానాకాలం రానున్న నేపథ్యంలో నీటి సంరక్షణ కోసం ఏం చేయాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చేయాల్సింది ఏమిటి.

author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 7:25 PM IST

Rain Water Harvesting Tips
Rain Water Harvesting Tips (ETV Bharat)
సమర్థ నిర్వహణతోనే జలసంరక్షణ - నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవే! (ETV Bharat)

Rain Water Harvesting Tips : ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇటీవల వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. అయితే వానాకాలం రాకముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే మాసం మధ్యలో ఎండలు దంచికొట్టాల్సి ఉండగా అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. ఉక్కపోత మాయమై ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వానలు కురుస్తున్నాయి సరే.

వర్షాలు కురిసిన ప్రతిసారి ఉత్పన్నం అయినట్లే ఈ సారి కూడా వాన నీటి సంరక్షణ ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఓ వైపు ప్రజలు నీటి కోసం అల్లాడుతూ ఉంటే మరో వైపు వాన నీరు వృథాగా పోతోంది. చెరువులు, కాలువలు, కుంటలు, భూగర్భంలోకి చేరాల్సిన వాన నీరు మురికి కాలువల్లోకి వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో వాన నీటి సంరక్షణకు అంతా ఇప్పుడే కదలాలి అన్న బాధ్యతను ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి. చుక్క చుక్కను ఒడిసి పట్టాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి.

బెంగళూరు పరిస్థితులు రాకుండా ఉండాలంటే : ఇటీవల బెంగళూరు ప్రజలు నీటి కొరతతో అల్లాడిన పరిస్థితులను దేశమంతా గమనించింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా నీటి కోసం అల్లాడిపోయారు. ఒక్క హైదరాబాద్‌ అనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాలు నీటి కొరతతో సతమతం అవుతున్నాయి. ఇది ఇప్పటిది కాదు, సుదీర్ఘకాలంగా నీటి ఎద్దడి దేశంలో పెద్ద సమస్యగా మారింది. కిలోమీటర్లు ప్రయాణించి బిందెడు నీరు మోసుకువెళ్లే దృశ్యాలు దేశంలో కోకొల్లలు.

ఇలాంటి పరిస్థితికి కేవలం నీటి వనరులు పరిమితంగా ఉండడమే కాదు, భూగర్భ జలాలను విపరీతంగా తోడడం, వర్షం కురిసిన సమయంలో దాన్ని ఒడిసిపట్టి నిల్వ చేయకపోవడం కూడా కారణమే. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా చెరువులు, కుంటలను పూడ్చి వేసి నిర్మాణాలు చేపట్టడం మరో కారణం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు వాననీటి సంరక్షణే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది. మరో పక్షం రోజుల్లో వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సిద్ధమై వర్షపు నీటిని సంరక్షించడం తక్షణావసరం.

భూగర్భ జలాలో ప్రధాన ఆధారం : భారత్‌లో భూగర్భ జలాల్లో 80శాతం వ్యవసాయానికి, 12శాతం పరిశ్రమలకు, 8శాతం తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. భూగర్భ జలవనరుల అంచనా నివేదిక-2020 ప్రకారం దేశీయంగా పంజాబ్‌, హరియాణా, దిల్లీ, రాజస్థాన్‌లో భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు మరింత క్షీణించే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్‌ గతంలోనే హెచ్చరించింది.

Depleting ground water : దేశవ్యాప్తంగా సుమారు 256 జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గ్రామీణ భారతంలో 85శాతం ప్రజలు తాగునీటికి, రోజువారీ అవసరాల కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. అందుకే భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ నిర్వహణ, అవి కలుషితం కాకుండా చూడడం చాలా అవసరం. భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల మరమ్మతు, పునరుద్ధరణ తదితర చర్యల కోసం జలగణన చేపట్టాలని గతంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది.

Report on Water resources : పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 24లక్షలకు పైగా కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, సరస్సుల వంటి జలవనరులు ఉన్నాయి. అందులో 38వేలకు పైగా ఆక్రమణకు గురయ్యాయి. దాదాపు నాలుగు లక్షల జల వనరులు నిరుపయోగంగా మారాయి. 97.1శాతం జలవనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 2.9శాతమే నగరాలు, పట్టణాల్లో నెలకొన్నాయి. దేశీయంగా నీటి సంరక్షణ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన చెక్‌ డ్యామ్‌లు 12.7శాతమే.

అధికశాతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో : మొత్తం నీటి వనరుల్లో 55శాతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోవాల్సిన జల వనరులు 45శాతం. ప్రపంచ జనాభాలో భారత్‌ జనాభా 18శాతం. కాని నీటి వనరుల పరంగా ఉన్న వాటా మాత్రం 4శాతమే. విచ్చలవిడి వాడకంతో పాటు సంరక్షణ చర్యలు లేకపోవడంతో భారత్‌లో నీటి కొరత ఏర్పడుతోంది. చెరువులు, కుంటలు వంటి జల వనరులను విచ్చలవిడిగా పూడ్చి వేయడంతో నీటి కొరత ఏర్పడడమే కాదు వర్షాలు కురిసినపుడు అవి నిల్వ అయ్యే ప్రదేశాలు లేక వరదలు నివాస ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.

Water Conservation TIPS : వర్షాకాలంలో నీటి సంరక్షణ జరగాలంటే కుంటలు, చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా పూడిక తీత పనులు చేపట్టాలి. నిరుపయోగంగా ఉన్న జలవనరులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలి. అవి ఆక్రమణ కాకుండా చూడడమూ తప్పనిసరి. జల వనరుల్లోకి చెత్తా చెదారం చేరకుండా జాలీలను ఏర్పాటు చేయాలి. వాన నీటిని ఒడిసిపట్టి సంరక్షించడంతో పాటు వాడిన జలాలను శుద్ధి చేసి భూమిలోకి ఇంకేలా చేయాలి. తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి.

జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వాన నీటి సంరక్షణ, మురుగు నీటి నిర్వహణ పనులను విరివిగా చేపట్టాలి. నగరాలు, పట్టణాల్లో భారీ విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలు, సంస్థలు తప్పనిసరిగా తమ ప్రాంగణంలోనే మురుగు నీటిని శుద్ధి చేసి భూమిలోకి ఇంకించే చర్యలు తీసుకోవాలి. బహుళ అంతస్థుల భవనాల్లోనూ వాన, వాడిన నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి. ఇందుకోసం ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి.

జలసంరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ

కేంద్ర పథకాలు సమన్వయం చేసుకుంటూ : వాన నీటి పరిరక్షణ కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదు, ప్రజలకు కూడా బాధ్యత ఉంది. నీటి సంరక్షణకు తమ పరిధిలో ఎంత వీలుంటే అంతగా కృషి చేయాలి. నీటి వనరుల పరిరక్షణకు ప్రజలతో పాటు స్థానిక, స్వచ్ఛంద సంస్థలు, వాటర్‌షెడ్‌ కమిటీలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు కలిసి కట్టుగా పని చేయాలి. జల్‌శక్తి అభియాన్‌, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటల్‌ భూజల్‌, ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన, అమృత్‌ సరోవర్‌ వంటి పథకాలను సమన్వయంతో చేపట్టాలి. స్థానిక నీటి సంరక్షణ విధానాలకు శాస్త్రీయత కల్పించి సాంకేతిక సాయంతో సమర్థంగా ఆచరణలో చూపాల్సిన అవసరం ఉంది. జలవనరుల సమర్థ నిర్వహణతో భూగర్భ జలాలు పెరుగుతాయి. అవి సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయి.

దేశమంతా కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతోంది. విచ్చలవిడి నిర్మాణాలతో నేలలోకి నీరు ఇంకే వీలు లేకుండా పోతోంది. ఓ వైపు చెరువులు, కుంటలు వంటి జల వనరులు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. పట్టణీకరణ ప్రభావంతో ఉన్న నీటి వనరులు సైతం కలుషితంగా మారిపోతున్నాయి. ఫలితంగా రోగాలు ప్రబలుతున్నాయి. నీటికి కొరత ఏర్పడడం, ఉన్న నీరు సైతం కలుషితంగా మారి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాన నీటి సంరక్షణే ఏకైక మార్గం.

ఓ ఉద్యమంలా జలసంరక్షణ : బొట్టు నీటిని సైతం ఆదా చేసేందుకు ఉద్యమంలా కదలాలి. ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వహిస్తూనే ప్రజలు సైతం స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాలి. భూమిపై పడిన నీటిని సంరక్షించడంతో పాటు తగినంతగా ఇంకే ఏర్పాటు చేయాలి. అప్పుడే నీటి కొరత అన్న మాట వినిపించదు.

నీటిని పొదుపుగా వాడడంతో పాటు దాని సంరక్షణ కూడా కీలకం కావాలి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. వర్షపు నీరు అంటే బంగారం అన్న భావవ రావాలి. వర్షాకాలం వచ్చేందుకు ఇంకా పక్షం రోజులు మిగిలి ఉంది. ఇప్పుడే వాన నీటి సంరక్షణకు కార్యాచరణ ఆరంభించాలి. అది ఈరోజు, ఈ క్షణమే ప్రారంభం అయితే యావత్‌ దేశానికి ప్రయోజనకరం అవుతుంది.

వర్షపు నీటిని ఒడిసిపడదాం.. కరవు నుంచి బయటపడదాం - RAIN WATER HARVESTING IN HYDERABAD

సీజన్ ఏదైనా.. వర్షాలు పడిన ప్రతిసారీ పరిస్థితి ఇంతేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.