IMD predicts Heavy Rains in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు తప్పేలా లేదు. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12లోపు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్పపీడనం వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దానిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.
అలర్ట్ : బంగాళాఖాతంలో మరో వాయు'గండం' - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు! - HEAVY RAIN IN ANDHRA PRADESH
ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించిన వాతావరణ శాఖ - 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడి
Published : Dec 7, 2024, 10:19 AM IST
|Updated : Dec 7, 2024, 10:31 AM IST