ETV Bharat / state

ఏపీలో వీడనున్న ఇసుక అక్రమాల గుట్టు - వాస్తవాలను సుప్రీంకోర్టుకు అందజేయనున్న కూటమి ప్రభుత్వం - Illegal sand Mining in AP - ILLEGAL SAND MINING IN AP

Supreme Court on Illegal Sand Smuggling in AP : గత సర్కార్​లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల లెక్కలు బయటపడనున్నాయి. అక్రమ తవ్వకాలపై వాస్తవాలను కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేయనుంది. ఇప్పటికే జిల్లాల నుంచి ప్రాథమిక రిపోర్టును ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Illegal Sand Mining in Andhra Pradesh
Illegal Sand Mining in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 8:39 AM IST

Illegal Sand Mining in Andhra Pradesh : గత ఐదేళ్లలో జగన్ సర్కార్​లో సాగిన అక్రమ ఇసుక దందా బయట పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో అక్రమ తవ్వకాలు లేవని పలు జిల్లాల కలెక్టర్లు నివేదికలిచ్చి తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నం చేయగా, తాజాగా వాస్తవాలతో నివేదికలు ఇస్తామని సుప్రీంకోర్టుకి తెలిపిన ప్రభుత్వం, ఆ దిశగా చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా వివిధ శాఖల అధికారులతో కూడిన జాయింట్ కమిటీలతో తొలుత ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఏం చర్యలు తీసుకున్నారనే వివరాలతో నెలాఖరుకు అఫిడవిట్ దాఖలుచేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లు గనులశాఖ అధికారులతో పరిశీలన చేయిస్తున్నారు.

Supreme Court on Illegal Sand Smuggling : జగన్‌ ప్రభుత్వంలో తొలుత ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేశారు. తర్వాత 2021 మేలో జేపీ సంస్థకు ఇసుక టెండర్ కట్టబెట్టినప్పటి నుంచి దందా మొదలైంది. అప్పట్నుంచి ఏం జరిగిందో లెక్కలు తీస్తున్నారు. ఇసుక తవ్వకాలకు పర్యావరణ మదింపు సంస్థ 470 పర్యావరణ అనుమతులు జారీ చేసింది. ఇప్పుడీ జాబితా తీసుకొని పరిశీలన చేస్తున్నారు. రద్దీ ఉన్న రీచ్‌ పరిధిలోనే, ఆ పరిమాణం మేరకే తవ్వారా? పక్కన కూడా తవ్వేశారా అనేది చూస్తున్నారు. అసలు ఈసీ లేకుండా తవ్వేసిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ గూగుల్ మ్యాప్స్ సహకారంతో నదుల్లో ఇసుక తవ్వకాలపై రిపోర్టులు ఇచ్చింది. ఇప్పుడు గనులశాఖ అధికారులూ అదే విధానం పాటిస్తున్నారు.

వైఎస్సార్సీపీ ఇసుక దందాకు గట్టు గల్లంతు- బిక్కుబిక్కుమంటున్న గోదావరి లంక గ్రామాల ప్రజలు - Lanka Villages Problems in ycp govt

ఫొటోల ఆధారంగా విచారణ : రాష్ట్రవ్యాప్తంగా నదుల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని గతేడాది మార్చిలో ఎన్జీటీ అదేశించినా, తవ్వకాలు అగలేదు. దీంతో ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ సందర్భంగా పిటిషనర్‌ దండా నాగేంద్రకుమార్‌ యంత్రాలతో ఇసుక తవ్వకాల ఫొటోలను అందజేశారు. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు అన్ని జిల్లాలకు 220 ఫొటోలను పంపించారు. గనులశాఖ అధికారులు ఆ ఫొటోల వారీగా పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరులోపు ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు.

నివేదికలు మార్చేసిన కలెక్టర్లు : మొన్నటివరకు గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు రిపోర్టులు ఇచ్చిన కలెక్టర్లు ఇప్పుడు బదిలీ అయిపోయారు. దాంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వీలుందని తెలుస్తోంది. గతంలో కొన్ని జిల్లాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని అక్కడి అధికారుల సంయుక్త కమిటీ నివేదించినా కలెక్టర్లు మాత్రం అంతా సవ్యంగా జరిగిందని రిపోర్టు పంపారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉల్లంఘనలు జరిగాయనడంతో కలెక్టర్ల నివేదికలు తప్పని తేలిపోయింది.

తర్వాత మరోసారి నివేదికలు కోరినప్పుడు కృష్ణా జిల్లా నుంచే అక్రమ తవ్వకాలు వాస్తవమంటూ రిపోర్టు వెళ్లింది. రిపోర్టు మార్చాలంటూ అక్కడి గనులశాఖ అధికారిపై ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెచ్చినా, అందుకు ఆయన నిరాకరించారు. ఈ ఏడాది మే 16న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటుచేసి, ఇసుక తవ్వకాలు జరగకుండా చూశారు. అంతకుముందు వరకు జరిగిన ఇసుక దోపిడీ గుట్టు ఈ నెలాఖరుకు సుప్రీంకోర్టుకు అందజేసే రిపోర్టుతో వీడనుంది.

గత నివేదికలపై అనుమానాలున్నాయ్​ - ఇసుక తవ్వకాలపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం - ILLEGAL SAND MINING CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.