llegal Sand Mining in Kurnool District: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కర్నూలు జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తవ్వకాలు జరపొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇసుకాసురులు యథేచ్చగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు వెల్లడించినా అధికారులు సైతం వాటిని పట్టించుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది.
నిస్సిగ్గుగా వ్యవహరించిన పోలీసులు- ఇసుక మైనింగ్ అడ్డుకున్న గ్రామస్థులపై జులుం
తాజాగా తుంగభద్ర నదిలోకి చొరబడి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. భారీ ప్రొక్లెయిన్లతో ఇసుకను బయటకు తీసి లారీల్లో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అటువైపు చూడంటం లేదు. కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం గుండ్రేవుల సమీపంలోని తుంగభద్ర నదిలో ఇసుకను కొల్లగొడుతున్నారు. కర్నూలు, తెలంగాణ సరిహద్దులో తుంగభద్ర ప్రవహిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నది ఎండిపోయింది. నదిలోకి చొరబడిన అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వి రాత్రంబవళ్లు తరలిస్తున్నారు. నదిలో అక్రమంగా రహదారి ఏర్పాటు చేసుకుని టిప్పర్లను నడుపుతున్నారు.
అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు - భారీ వాహనాలతో దెబ్బతింటున్న రోడ్లు
నిత్యం వందలాది లారీల ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అండదండలతోనే తుంగభద్రలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని కర్నూలు ప్రజలు ఆరోపిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుక తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజవనరులను దోచేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈడీకి ఏపీ కనిపించదా - అధికార పార్టీ ఇసుక దందా ఎన్ని వేలకోట్లో!
"రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. భారీ ప్రొక్లెయిన్లతో తుంగభద్ర నదిలో ఇసుకను తవ్వి లారీల్లో తరలిస్తున్నారు. నిత్యం వందలాది లారీల ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో అక్రమంగా రహదారి ఏర్పాటు చేసుకుని టిప్పర్లను నడుపుతున్నారు. అధికారపార్టీ నేతల అండదండలతోనే ఈ ఇసుక దందా జరగటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నదీ గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టి భూగర్భజలాలను కాపాడాలని కోరుతున్నాం." - స్థానికులు
ఇసుక కాంట్రాక్టులతో వేల కోట్లు దోచుకున్న వైఎస్సార్సీపీ నేతలు : పట్టాభి