Hydra Key Decision Ponds Encroachments : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరగు కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు. చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వొచ్చని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
కొంత మంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది : నగరంలో చెరువుల సంరక్షణ కోసం కొంత మందికి ఇబ్బంది అయినా, కఠిన నిర్ణయాలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం (నవంబర్ 03) పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన జియో స్మార్ట్ ఇండియా రెండో సదస్సులో మాట్లాడిన ఆయన, జియో సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని తెలిపారు. పారిశ్రామిక రంగాలతో పాటు ప్రభుత్వాలకు స్పెషియల్ టెక్నాలజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా చెరువులను గుర్తించి హైడ్రా వాటిని కాపాడుతుందని, దాని ద్వారానే ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నట్లు తెలిపారు. నాళాలు ఆక్రమణకు గురై వాటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ పోయి వ్యర్థ జలాలు చెరువులో కలుస్తున్నాయని వివరించారు.