ETV Bharat / state

చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్లపై రీసర్వే చేశాకే 'బుల్డోజర్' - వ్యూహం మార్చుకున్న హైడ్రా - HYDRA resurvey FTL and buffer zones

Hydra Changed Tactics : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది. చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్క్ చేశాకే కూల్చివేతలకు దిగబోతుంది. ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని హైడ్రా ప్రకటించింది. కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేలా అండగా ఉండాలని నిర్ణయించుకుంది.

Hydra
Hydra Changed Tactics (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 6:55 AM IST

Updated : Sep 10, 2024, 8:32 AM IST

HYDRA for Resurvey FTL and Buffer Zones : వందలో ఇద్దరు నష్టపోయినా, 98 మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మారుస్తోంది. ఆక్రమణదారుల అంచనాలను తలకిందులు చేస్తూ వారాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న కన్వెన్షన్ సెంటర్లు, షెడ్లతో పాటు చిన్న చిన్న గుడిసెలు, భారీ భవనాల వరకు గంటల వ్యవధిలో కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట కూల్చివేతల విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్‌లో కొత్తగా నిర్మించే నివాసాలు, నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని, ఇప్పటికే శాశ్వతంగా ఉంటున్న నివాసాల జోలికి హైడ్రా వెళ్లబోదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా హైడ్రా వ్యూహంలోనూ పంథా మార్చబోతున్నారు. ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్ల వివాదం ముదురుతున్న క్రమంలో ఇప్పటి వరకు గుర్తించిన ఆక్రమణలకు సంబంధించి రీ సర్వే చేశాకే, కూల్చివేతలు చేపట్టాలనే దిశగా హైడ్రా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో కూల్చివేతలను చేపట్టిన హైడ్రా, మొత్తం 28 అనధికారికంగా నిర్మించిన విల్లాల్లో 14 విల్లాలను నేలమట్టం చేసింది. మరో 18 విల్లాల్లో కుటుంబాలు నివసిస్తుండగా వాటిని కూల్చివేతల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ విషయంపై అనేక అనుమానాలు ఉన్న బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు. బుద్దభవన్‌లోని ప్రధాన కార్యాలయంలో 15 మందితో సమావేశమైన రంగనాథ్ బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కత్వా చెరువుకు రీ సర్వే : హైడ్రా కూల్చివేతలపై బాధితులకు సమగ్రంగా వివరణ ఇచ్చిన కమిషనర్​, కత్వా చెరువు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​ నిర్ధారణ కోసం రీ సర్వే చేయించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్​, నీటి పారుదల శాఖ సంయుక్తంగా వారం, పది రోజుల్లో రీ సర్వే చేసి కొత్త ఎఫ్​టీఎల్​ను నిర్దారిస్తుందని వివరించారు. అప్పటి వరకు కొత్తగా ఎలాంటి నిర్మాణాల కూల్చివేత చేపట్టబోదని హామీ ఇచ్చారు. నష్టపోయిన బాధితులకు బిల్డర్ నుంచి పరిహారం ఇప్పించేలా హైడ్రా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రిట్ పిటిషన్లు వేసి స్టేలు తెచ్చుకుంటే శాశ్వత పరిష్కారం దొరకదని రంగనాథ్ తేల్చి చెప్పారు.

రంగనాథ్​ను కలిసిన బాధితులు : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​తో సమావేశంపై కత్వా చెరువు బాధితులు హర్షం వ్యక్తం చేశారు. తమను పిలిచి సమస్యలు అడిగి తెలుసుకోవడం ఎంతో భరోసాను ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. సమీపంలో ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే అడ్డుకునేలా అవగాహన కల్పించారని చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా అధికారులకు రంగనాథ్​ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా తీసుకున్న తాజా నిర్ణయాన్ని, విధి విధానాలను వారికి వివరించారు. ఇటీవల పరిణామాల దృష్ట్యా మరింత పకడ్బందీగా ఉండాలని రంగనాథ్​ అధికారులకు సూచించారు.

హైడ్రా కీలక నిర్ణయం - ఇప్పటికే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చం : ఏవీ రంగనాథ్‌ - Hydra Clarify On Demolitions

కబ్జా అని తెలిస్తే చాలు - ఎవరి తాలుకానైనా 'బుల్డోజర్​ వేటు' పడాల్సిందే : ఆక్రమణదారుల్లో 'హైడ్రా' వణుకు - Hydra Demolitions in Mallampet

Last Updated : Sep 10, 2024, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.