ETV Bharat / state

మళ్లీ జేసీబీలకు పనిచెప్పిన హైడ్రా - ఈసారి రూట్​ మార్చిందిగా!

అక్రమ నిర్మాణాల కూల్చివేతలే పరమావధిగా పనిచేస్తున్న హైడ్రా - కాస్త రూట్​ మార్చి వాటి శిథిలాలను తొలగించే పనిలో బిజీ

Hydra Remove Building Materials
Hydra Remove Building Materials (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Hydra Remove Building Materials : హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఎఫ్​టీఎల్​లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలపైనే కాకుండా వాటి శిథిలాల తొలగింపుపై కూడా హైడ్రా దృష్టి సారించింది. తొలుత నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువులో కూల్చివేసిన భవనాల వ్యర్థాల తొలగింపును చేపట్టిన హైడ్రా, పూర్తి స్థాయిలో అక్కడి శిథిలాలను తొలగించి ఆ చెరువునకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

అందులో భాగంగా అక్కడి వ్యర్థాల్లో భవన నిర్మాణ యజమానులు వారికి అవసరమైన సామాగ్రిని తీసుకుపోగా, మిగిలిన శిథిలాలను జేసీబీల సహాయంతో లారీల్లో నగరం వెలుపలికి తరలిస్తోంది. ఎర్రకుంట ఎఫ్​టీఎల్​లో అక్రమంగా 5 అంతస్తుల్లో 3 భవనాలను నిర్మించారు. వాటిని గుర్తించిన హైడ్రా ఆగస్టు 14న కూల్చివేసింది. వ్యర్థాలను తొలగించని నిర్మాణదారుడికి నోటీసులిచ్చి ఎర్రకుంటలో గుట్టలుగా పడి ఉన్న వ్యర్థాలను తొలగించే పనులను ప్రారంభించింది. ఎర్రకుంట చెరువులో హైడ్రా వ్యర్థాల తొలగింపుతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

HYDRA On Restoration of Ponds : సహజ సిద్ధంగా ఏర్పడ్డ చెరువులను రాబోయే తరానికి, అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలి. ఆక్రమణలకు గురైన ల్యాండ్​ను స్వాధీనం చేసుకుని సరస్సుల్లా మార్చాలి. ఈ లక్ష్యాలతో నూతన తరహాలో జలవనరులకు పునరుజ్జీవం కల్పించేందుకు హైడ్రా కసరత్తులు ప్రారంభించింది. ముందుగా 'చెరువులు ఎందుకు?' అనే చిన్న ప్రశ్నతో చర్చను ప్రారంభించింది. నీటి పారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులతో పాటు వాలంటరీ ఆర్గనైజేషన్స్ పరిశోధన, నిపుణులతో కమిషనర్‌ ఏ.వి.రంగనాథ్‌ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు.

అప్పట్లో చెరువులే వేరు : 50 ఏళ్ల క్రితం నగరంలోని అనేక చెరువులు వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడేవి. సిటీగా రూపాంతరం చెంది పొలాలన్నీ కాలనీలయ్యాయి. హయత్‌నగర్‌, గౌరెల్లి, ప్రతాపసింగారం, తూంకుంట, నార్సింగి వంటి పలు చోట్ల పంట పొలాలు కనిపిస్తున్నప్పటికీ అవి బోరు బావులపై ఆధారపడినవి. నగర జనాభా రోజురోజుకూ పెరగడంతో చెరువులు మురుగు కూపాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిండుగా మురుగునీటిని నిల్వ చేయడం అవసరమా? అనే అంశంపై ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది.

ఉదాహరణకు ఎఫ్టీఎల్‌ పరిధిలోని ల్యాండ్​ను స్వల్పంగా వాలు ఉండేట్టు చదును చేయాలి. బండరాళ్లు, గుట్టలున్న చోట దీవులను ఏర్పాటు చేయాలి. చెరువులోకి వచ్చే మురుగు నీటిని వలయం లాంటి నాలాలోకి పంపించి ఎస్టీపీలో శుభ్ర పరచాలి. లేకపోతే బెంగళూరులో మాదిరి వేర్వేరు దశల్లో ఫిల్టరింగ్​ సిస్టంను ఏర్పాటు చేసి శుద్ధి చేయొచ్చు. అలుగు అంచు వరకు నిల్వ చేయాల్సిన పనేలేదు. అలా చేస్తే తటాకం ప్రాణం పోసుకుంటుందని ఇటీవల జరిగిన మీటింగ్​లో నిపుణులు చర్చించారు. భారీ వర్షాలతో వరద ఉద్ధృతితో నాలాలు నిండుకుంటాలా మారిపోతున్నాయి. కీలక మలుపుల వద్ద ఆక్రమణలను తొలగించి, అవసరమైన చోట లోతును పెంచడం వంటి చర్యలతో నాలాల్లో ఉద్ధృతను నియంత్రించవచ్చని హైడ్రా అధికారులు భావిస్తున్నారు.

కూల్చివేతలే కాదు ఇక నుంచి రైట్​ రైట్​ కూడా - హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై హైడ్రా ఫోకస్‌

ఇకపై హైడ్రా ఫోకస్ అంతా వారిపైనే - లిస్ట్​ కూడా రెడీ! అంతా పెద్దపెద్దొళ్లే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.