ETV Bharat / state

కావూరి హిల్స్​పైకి 'హైడ్రా' బుల్డోజర్లు - నేలమట్టమైన అక్రమ నిర్మాణాలు - HYDRA DEMOLITIONS IN MADHAPUR

Hydra Demolitions in Madhapur : హైదరాబాద్ మాదాపూర్​లోని కావూరి హిల్స్​లో హైడ్రా బుల్డోజర్లకు పని చెప్పింది. కావూరి హిల్స్​ పార్కులోని అక్రమ షెడ్లను కూల్చేసింది. గడువు తీరకముందే స్పోర్ట్స్​ అకాడమీని అన్యాయంగా కూల్చేశారని నిర్వాహకులు ఆరోపించారు. కాగా కావూరి హిల్స్​ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ వివరణ ఇచ్చారు.

Hydra Demolitions in Madhapur
Hydra Demolitions in Madhapur (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 9:41 AM IST

Updated : Sep 23, 2024, 9:48 PM IST

Hydra Demolitions Illegal Structures in Madhapur : రాజధాని పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణనే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. ఆదివారం నుంచి కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు ఇవాళ కూడా ఆక్రమణల అంతు చూస్తున్నాయి. సోమవారం (సెప్టెంబరు 23వ తేదీ) మాదాపూర్​లోని కావూరి హిల్స్​ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లను హైడ్రా కూల్చేసింది.

పార్కు స్థలంలో స్పోర్ట్స్​ అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్​ అకాడమీపై కావూరి హిల్స్​ అసోసియేషన్​ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్​ అసోసియేషన్​ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్​ పార్కు పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్​ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు కూల్చివేశాం : హైకోర్టు ఆదేశాల మేరకు కావూరిహిల్స్​లో పార్కు​ ప్రదేశాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించినట్లు హైడ్రా కమిషనర్​ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు కావూరి హిల్స్​ పార్క్​ కూల్చివేతలకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు.

కావూరిహిల్స్ రెసిడెన్షియల్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించిందని, పార్క్ లేఔట్​ స్థలంలో ఆక్రమణలు తొలిగించాలని హైకోర్టు ఆదేశించినట్లు తెలిపారు. జీహెచ్​ఎంసీ సర్కిల్​ టౌన్​ ప్లానింగ్ విభాగం అభ్యర్థన మేరకు హైడ్రా కావూరి హిల్స్​ పార్క్​లోని 3 షెడ్లు, టెన్నిస్​ కోర్టును కూల్చివేసినట్లు రంగనాథ్ తెలిపారు. 2 వేల చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని పార్క్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులకు అప్పగించినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు.

ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా - ఆక్రమణల గుర్తింపు

44 అక్రమ నిర్మాణాల నేలమట్టం - 8 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం : హైడ్రా ప్రకటన - HYDRA Announcement On Demolitions

Last Updated : Sep 23, 2024, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.