Hyderabad Women Murdered in Australia : భార్యను చంపాడు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చెత్తడబ్బాలో పడేశాడు. హత్య అనంతరం కుమారుడిని ఇండియాకు తీసుకొచ్చి అత్తవారింట్లో వదిలేశాడు. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శ్వేత అనే మహిళను, ఆమె భర్త అశోక్‌రాజ్ హత్య చేసి రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో పడేశాడు.
హత్య అనంతరం కుమారుడిని హైదరాబాద్ తీసుకొచ్చి శ్వేత అమ్మవాళ్ల ఇంట్లో వదిలేశాడు. తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. మృతదేహాన్ని గుర్తించిన విక్టోరియా పోలీసులు(Victoria Police) దర్యాప్తు చేపట్టి, అశోక్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆస్ట్రేలియాలో మృతి చెందిన శ్వేత మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ నగరానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
MLA Laxma Reddy on Swetha Death Issue : ఇందుకోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోనూ మాట్లాడినట్లు స్పష్టం చేశారు. అక్కడ శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసినట్లు సమాచారం ఉందన్నారు. పంచనామా నివేదిక(Postmortem Report) వచ్చిన తర్వాత ఆమె భౌతికకాయాన్ని నగరానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్ సాయంతో ఫ్రెండ్‌ను హత్య చేసిన స్నేహితుడు
ప్రేమ పేరుతో యువతి కుటుంబంపై దాడి - ప్రతిఘటనలో ప్రేమోన్మాది మృతి