ETV Bharat / state

మందుబాబులకు మింగుడు పడని వార్త - ఆ 2 రోజులు మద్యం దుకాణాలు బంద్ - Wines Closed Due to Immersion - WINES CLOSED DUE TO IMMERSION

WineShops Close for Ganesh Immersion : రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్​ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు మూసేయాలని స్పష్టం చేశారు.

Wines Closed Due to Ganesh Immersion
WineShops Close for Ganesh Immersion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 10:54 AM IST

Updated : Sep 13, 2024, 12:07 PM IST

Wines Closed Due to Ganesh Immersion : రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్​ నవరాత్రోత్సవాలను ప్రజలు ఆనందోత్సహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరువాడల్లో గణనాథుడి మండపాలు ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. గణేశ్​ మండపాలు విద్యుత్ కాంతులతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. వివిధ రూపాల్లో కొలువుదీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు గణనాథుల నిమజ్జనం ఉత్సాహంగా సాగుతోంది. గణనాథులను వాహనాలపై ఊరేగిస్తూ వైభవంగా నిమజ్జనం చేస్తున్నారు.

అనంత చతుర్ధశి సందర్భంగా ఈ నెల 17న గణేశ్​ నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బి.రాజవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల పేరుతో వదంతులు వ్యాపిస్తున్నాయని, నెక్లెస్‌ రోడ్డ్​, ఎన్టీఆర్​ మార్గ్​లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గణేశ్​ నిమజ్జనాలపై కోర్టు ధిక్కార పిటిషన్​ను న్యాయస్థానం కొట్టివేసిందని, నిమజ్జనాలకు ఎలాంటి అడ్డంకులు లేవని వివరించారు. 2021 హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలనూ నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపారు.

విద్రోహ శక్తులపై నిఘా : ఈ నేపథ్యంలో బొజ్జ గణపయ్య నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నింటికీ రూల్స్​ వర్తిస్తాయని స్పష్టం చేశారు. గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌-ఉన్‌-నబీ ఊరేగింపులు సజావుగా ముగిసేందుకు ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలని సీవీ ఆనంద్‌ అధికారులను సూచించారు. గురువారం సౌత్‌-ఈస్ట్‌ జోన్‌ను, ఈస్ట్‌ జోన్‌ను సందర్శించిన ఆయన, అధికారులతో సమావేశమయ్యారు.

సున్నితమైన ప్రాంతాలు రెండు జోన్లలో ఉన్నాయని సీవీ ఆనంద్‌ అధికారులకు వివరించారు. కమ్యూనల్‌ రౌడీలు, ఇతర సంఘ విద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. మరోవైపు గణేశ్​ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17, 18న లింగంపల్లి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌ ప్రాంతాల నుంచి రాత్రి, ఉదయం రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది.

హుస్సేన్‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనాలు - ప్లాన్​ రెడీ చేసిన అధికారులు - Ganesh Immersion in Tank Bund

Last Updated : Sep 13, 2024, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.