Hyderabad Police Arrested Drug Seller Nigerian At Panjagutta : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన నేరగాడిని టీన్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రానికి చెందిన ఇవూలా ఉడోక స్టాన్లీ ఉత్తర గోవాలోని కండోలింలో నివసిస్తూ మత్తు దందా కొనసాగిస్తున్నాడు. కొరియర్ ద్వారా మాదకద్రవ్యాలను రవాణ చేసి తీసుకువస్తున్నాడు. గోవా నుంచి వాటిని హైదరాబాద్‌కు చేరుస్తూ అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. ఇతన్ని టీన్యాబ్ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద పట్టుకోవడంతో మాదకద్రవ్యాల బండారం బయటపడింది.
వస్త్ర వ్యాపారం నుంచి డ్రగ్ సప్లయర్‌గా మారి : స్టాన్లీ 2009లో బిజినెస్ వీసాపై భారత దేశానికి వచ్చాడు. ప్రారంభంలో వస్త్ర వ్యాపారం నిర్వహించాడు. కొవిడ్ సమయంలో అధికంగా నష్టాలు వచ్చాయి. అతని పాస్‌పోర్టు కాలం చెల్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ క్రమంలో డబ్బు సంపాదించడానికి కొంతమంది మాదకద్రవ్యాలు విక్రయించే ఇతర నైజీరియన్లతో స్టాన్లీ చేతులు కలిపాడు. వారికి మత్తు పదార్థాలు విక్రయించడంలో సహాయపడ్డాడు. క్రమంగా ఇతర నైజీరియన్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో స్టాన్లీ ఈ దందాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా మత్తుపదార్థాలు రప్పించి విక్రయాలు జరుపుతున్నాడు.
రూ.కోటి 20 లక్షల విలువైన నకిలీ మద్యం ధ్వంసం
దేశవ్యాప్తంగా ఏకంగా 500 మంది స్టాన్లీ వద్ద మత్తు పదార్ధాలు కొనుగోలు చేస్తున్నారంటే అతను ఏ స్థాయిలో మత్తు దందా కొనసాగిస్తున్నాడో అర్ధం అవుతోంది. మాదకద్రవ్యాలు కొనుగోలు చేసే వారిలో ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరందరి వివరాలు పోలీసులు రాబడుతున్నారు. వారిని కూడా విచారించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
TS NAB Police Arrested Nigerian For Selling Drugs in India : నిందితుడిని 2017లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) అధికారులు స్టాన్లీని అరెస్టు చేశారు. అతను జైలుకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ కేసులో ప్రస్తుతం దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. తాజాగా మరోసారి టీన్యాబ్ పోలీసులకు మత్తు పదార్థాలు సప్లై చేస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి పోలీసులు 557 గ్రాముల కొకైన్, 21 గ్రాములు హెరాయిన్, 215 గ్రాముల చరస్‌తో పాటు 390 గ్రాముల ఎస్‌టస్సీ పిల్స్, 105 ఎల్‌ఎస్‌డి బ్లాట్స్, 7 గ్రాముల యాంఫేటమిన్, 45 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
గోవా నుంచి తెచ్చి హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయం - రాజ్‌తరుణ్ ప్రేయసి అరెస్ట్
మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. పబ్బులు, బార్లపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు కలిసి పని చేస్తేనే మాదకద్రవ్యాలను నిర్మూలించవచ్చని, ఆ దిశగా పనిచేసేందుకు అందరూ ముందుకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వాటిని స్వీకరించే వారి గురించి ఫిర్యాదు చేయాలి అనుకుంటే టీఎస్ న్యాబ్ టోల్ ఫ్రీ నెంబర్ 8712671111కు సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!
హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత - నైజీరియన్ నుంచి కొని ఇక్కడ అమ్మకాలు