ETV Bharat / state

మెట్రో రెండో దశ డీపీఆర్​లు సిద్ధం - 5 మార్గాల్లో కలిపి 78.6 కి.మీ. - Hyderabad Metro Phase 2 dprs ready - HYDERABAD METRO PHASE 2 DPRS READY

Hyderabad Metro Rail Phase 2 Project : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్​లు దాదాపు సిద్ధమయ్యాయి. ఈ డీపీఆర్​లలో 5 మార్గాల్లో కలిపి 78.6 కిలోమీటర్లు ఉంది. ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం అనుమతి కోసం పంపనున్నారు.

Hyderabad Metro Rail Phase 2 Project
Hyderabad Metro Rail Phase 2 Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 10:25 AM IST

Hyderabad Metro Phase 2 : హైదరాబాద్​ మహానగరానికి ఓఆర్​ఆర్ తర్వాత మణిహారం లాంటి మెట్రో రైలు రెండో దశ వేగం పుంజుకుంది. రెండో దశకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు దాదాపుగా సిద్ధం అయ్యాయి. రెండో దశ మెట్రో రైలు 5 మార్గాల్లో కలిపి 78.6 కి.మీ.గా ఉండనుంది. ఇదే విషయమై ప్రతిపాదనలు కూడా గతంలోనే జరిగాయి. 60కి పైగా స్టేషన్లు వచ్చి, రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే ఈ మార్గాలపై పలుమార్లు సీఎం సూచనలు చేశారు. ఈ మేరకు రెండో దశ డీపీఆర్​లు వేర్వేరుగా రూపుదిద్దుకున్నాయి. ఈ డీపీఆర్​లను ఈనెలాఖరు నాటికి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అనంతరం మంత్రిమండలిలో ఆమోదం తెలిపి, వాటిని కేంద్రం అనుమతి కోసం పంపిస్తారు.

కొత్త మార్గాలన్నీ కొనసాగింపే : ఈ రెండు డీపీఆర్​లో సీఎం సూచించిన కొత్త మార్గాలన్నీ కొనసాగించారు. రెండో దశలో ప్రతిపాదించిన మార్గాలన్నీ మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి.

  • కారిడార్-3కి కొనసాగింపుగా నాగోల్ నుంచి ఎల్బీనగర్, మైలార్​దేవుపల్లి, జల్​పల్లి, శంషాబాద్ విమానాశ్రయం వరకు 33.1 కిలోమీటర్లను పొడిగిస్తారు. ఈ మార్గంలో 22 స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ కారిడార్​నే మైలార్​దేవుపల్లి నుంచి ఆరాంఘర్, రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ సమీపంలో నిర్మించే కొత్త హైకోర్టు వరకు పొడిగిస్తారు. మూడు స్టేషన్లలతో దాదాపు 5 కిలోమీటర్లు దూరం ఉండనుంది.
  • అలాగే ఈ కారిడార్-3కి మరోవైపు రాయదుర్గం నుంచి కాజాగూడ, నానక్​రాంగూడ, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, యూఎస్ కాన్సులేట్ మీదుగా కోకాపేట నియో పోలీసు వరకు 11.3 కిలోమీటర్ల వరకు విస్తరించడానికి డీపీఆర్​ను సిద్ధం చేశారు.
  • కారిడార్-1కి కొనసాగింపుగా ఎల్బీనగర్ నుంచి హయత్​నగర్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని పొడిగిస్తారు.
  • మరోవైపు కారిడార్-1కి రెండోవైపు పొడిగింపుగా మియాపూర్ నుంచి పటాన్​చెరు వరకు 14 కిలోమీటర్లు పొడిగించి, చందానగర్ ప్రాంతంలో కొంతదూరం డబుల్ డెక్​ని ప్రతిపాదించగా, ఈ మార్గంలో 10 స్టేషన్లు రానున్నాయి.
  • కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్​నుమా, చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. పొడిగిస్తారు. ఆరు స్టేషన్లు రానున్నాయి.

నాలుగో నగరంపై త్వరలో స్పష్టత : త్వరగా కేంద్రానికి రెండోదశ డీపీఆర్​లు చేరాలంటే ఫ్యూచర్​సిటీని మినహాయించాల్సి ఉంది. ఎందుకంటే విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి 32 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఒకవేళ ఐదు కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో డీపీఆర్​ను కూడా కలిపి పంపాలని కేంద్రం కోరితే మెట్రో విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈరెండు కలిపితే 110 కిలోమీటర్లు అవుతుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఫ్యూచర్‌ సిటీపై రేవంత్ ఫోకస్‌ - 'మెట్రో మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయండి' - CM REVANTH ON FUTURE CITY

హైదరాబాద్​లో అండర్ ​గ్రౌండ్ మెట్రో - ఎయిర్​పోర్టు కారిడార్‌లో తొలిసారి ప్రయోగం - Underground Metro in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.