ETV Bharat / state

నిషేధిత జాబితాలో వందల లే అవుట్లు - LRSకు నో ఛాన్స్ - మీ భూములు కూడా ఉన్నాయా చెక్ చేస్కోండి

నిషేధిత జాబితాలో వందలాది లే అవుట్లు - సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జాబితా - బెంబేలెత్తిపోతున్న లేఅవుట్ల యజమానులు - ఈ విషయంపై కమిషనర్​ సర్ఫరాజ్‌ అహ్మద్ సీరియస్​

Layouts Banned List Issue Latest News
Layouts Banned List Issue Latest News (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Layouts Banned List Issue Latest News : హెచ్​ఎండీఏ పరిధిలోని వందలాది పంచాయతీ లేఅవుట్లు నిషేధిత జాబితాలో చేర్చారని కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఇదే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు, వదంతులు వినిపిస్తుండటంతో ఆయా లేఅవుట్ల యజమానులు బెంబేలెత్తి పోతున్నారు. ఈ క్రమంలో వారు హెచ్​ఎండీఏ కార్యాలయానికి పరుగుతీస్తున్నారు. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ జాబితాపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు అధికారులు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

గతంలో వందలాది పంచాయతీ లేఅవుట్లు హెచ్​ఎండీఏ ఏర్పడకముందు ఏర్పడ్డాయి. ఇవి ముఖ్యంగా రంగారెడ్డి, పెద్ద అంబర్​పేట్​, అబ్దుల్లాపూర్​మెట్​, ఆదిభట్ల, మంగల్​పల్లి, మన్నెగూడ, తుర్కయాంజిల్​, కమ్మగూడ, రాగన్నగూడ, నాదర్​గుల్​, గుర్రంగూడ, బాలాపూర్​ తదితర ప్రాంతాల్లో వందలాది పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. వీటిని అప్పుడే లేఅవుట్లు వేసి విక్రయించేశారు. హెచ్​ఎండీఏ వచ్చిన తర్వాత ఈ లేఅవుట్లలో కొన్నింటిని క్రమబద్ధీకరించారు. ఈ క్రమంలో వీటిలో పెద్దపెద్ద బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.

ప్రస్తుతం ఇవన్నీ నగరానికి సమీపంలో ఉన్నాయి. ఇక్కడ భూములు ధరలు సైతం భారీగానే పలుకుతున్నాయి. ఇంకా కొన్ని లేఅవుట్ల క్రమబద్ధీకరించలేదు. వీటి కోసం గతంలో చాలా మంది రూ.1000 చెల్లించి అక్రమంగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్​ఆర్​ఎస్​) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలోనే ఈ నిషేధిత జాబితా సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది. దీంతో ఒక్కసారిగా దరఖాస్తుదారులు అవాక్కయ్యారు. ఇదేంటి ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకుంటే నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయందని లబోదిబోమంటున్నారు.

ఆందోళనలో యజమానులు : ఈ పంచాయతీ లేఅవుట్లని ఏపీ రిజిస్ట్రేషన్​ చట్టం 2007 నవంబరు 19, సెక్షన్​ 22ఎ(1)(ఈ) కింద నిషేధిత జాబితాలో పెట్టారు. దరఖాస్తుదారులంతా ఈ విషయంపై అప్రమత్తమై హెచ్​ఎండీఏ అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ నిషేధిత జాబితాలో భూములు, లే అవుట్లు ఉంటే.. భూముల క్రయవిక్రయాల సమయంలో ఈ భూములను రిజిస్ట్రేషన్​ చేయరు. ప్రభుత్వ, ఇతర వివాదాలున్నా వాటిని ఈ జాబితాలో సర్వే నంబర్లతో సహా చేర్చుతున్నారు. ఆయా సర్వే నంబర్లలోని ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసేందుకు రిజిస్ట్రేషన్​ ముందుకు వస్తే వెంటనే అధికారులు అడ్డుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు తాజాగా పంచాయతీ లేఅవుట్లు ఈ జాబితాలో కనిపించడంతో ఆయా భూముల యజమానులంతా బెంబేత్తుతున్నారు. ఎల్​ఆర్​ఎస్​ కింద క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఈ లేఅవుట్లు తిరస్కరించే అవకాశం ఉంది. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లీజుల దందా - అద్దెల చెల్లింపులో హెచ్​ఎండీఏకు మొండిచెయ్యి

సర్కారీ లే అవుట్లు - ఔటర్‌ చుట్టూ 924.28 ఎకరాల్లో అభివృద్ధికి ప్రభుత్వం సన్నాహాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.