Hyderabad IIIT Students Research On Objectification on Women : యువతులు మహిళలు నిండుగా దుస్తులు ధరించినా యువకులు పురుషులు చాలా సందర్భాల్లో వారిని అనుచితంగా చూస్తున్నారని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కాగ్నిటివ్ సైన్స్‌ల్యాబ్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. నెదర్‌ల్యాండ్స్‌లోని రోటాడామ్ నగరంలో జులైలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తమ పరిశోధన పత్రాన్ని సమర్పించారు.
ప్రొఫెసర్ కవితా వేమూరి, పరిశోధక విద్యార్థులు ఆయుషి అగర్వాల్, శ్రీజా భూపతిరాజులు భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లోని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, మెట్రోనగరాల్లోని ఐటీ సంస్థలను సందర్శించి యువకులు, ఐటీ ఉద్యోగులకు యువతులు, మహిళల చిత్రాలను ఇచ్చి ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ సాయంతో వారి దృశ్య దృష్టిని పరిశీలించారు. వారి మనోభావాలను సేకరించి పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అనంతరం బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణా సాధనాలు, పెళ్లిళ్లు, వేడుకలకు వెళ్లి యువకులు, పురుషుల దృష్టిని పరిశీలించగా యువతులు, మహిళలను చాలామంది అనుచితంగా చూస్తున్నారని గుర్తించినట్లు పేర్కొన్నారు.
'ఆ కారణాల వల్లే మహిళలు ఉద్యోగంలో తిరిగి చేరడం లేదు' - Working Women Problems
- యువతులు, మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపుల వెనుక మత్తు, సామాజిక మాధ్యమాల్లో అశ్లీలం, సినిమాల్లోని ఐటం సాంగ్‌లు ప్రధాన కారణాలని ప్రొఫెసర్ కవిత పేర్కొన్నారు. తమ నివేదిక వివరాలను ఆమె వెల్లడించారు.
- మద్యం తాగుతున్న యువకులు, మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నవారు యువతులు, మహిళలను లైంగిక కోర్కెలు తీర్చేవారిగా భావిస్తున్నారని తెలిపారు. పరిచితులు, అపరిచితులను కూడా వదలకుండా వేధిస్తున్నారని వివరించారు.
- మనదేశంలో భిన్నమైన సంస్కృతులు, ఆచారాలు, అలవాట్లు కారణంగా మహిళలు, యువతుల వస్త్రధారణ ఇలాగే ఉండాలన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఎలాగంటే కురచదుస్తులు ధరించిన యువతిపై లైంగిక దాడి జరిగితే సానుభూతి ఒకలా, సల్వార్- కుర్తా ధరించిన యువతిపై లైంగికదాడి చేస్తే మరోరకంగా ఉంటుందని వారి అధ్యయనంలో వెల్లడైందని వివరించారు.
బొమ్మలకు దుస్తులు ధరించి పరిశోధన : ఎలాంటి ఆహార్యంతో ఉంటే పురుషులు యువతులు, మహిళలను అనుచితంగా చూస్తున్నారన్న అంశంపై ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ పరిశోధకులు బొమ్మలతో ప్రయోగాలు చేశారు. కొన్ని బొమ్మలను చీరలు, సల్వార్, కుర్తాలు ధరించారు. మరికొన్ని బొమ్మలకు జీన్స్‌ప్యాంట్ షర్టులను ధరించారు. వాటిని వేలాదిమందికి పంపిణీ చేశారు. వాటిని చూస్తున్నప్పుడు ముఖ కవళికలను, బొమ్మల్లో వేటిని చూడటానికి ప్రాధన్యామిస్తున్నారని తెలుసుకునేందుకు 'హీట్ మ్యాప్' పరిజ్ఞాన్నాని ఉపయోగించారు. ఎక్కువమంది ముఖంతో పాటు లైంగిక శరీరభాగాలను చూసేందుకు ప్రాధాన్యమిచ్చారని వారి ప్రయోగాల్లో తెలిసిందని పేర్కొన్నారు.
మహిళలపై వివక్ష - 'పింక్ ట్యాక్స్' పేరుతో కంపెనీల అనధికారిక దోపిడీ! - Pink Tax