ETV Bharat / state

సైబర్ కేటుగాళ్లతో బ్యాంక్ మేనేజర్ డీలింగ్స్ - రూ.175 కోట్లు చైనాకు హవాలా - HYD SBI BRANCH 175 CRORES FRAUD - HYD SBI BRANCH 175 CRORES FRAUD

Bank Manager Involved In Cyber Crime : సైబర్‌ నేరాల్లో దోచేసిన డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో దేశం దాటిస్తూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నేరగాళ్లు పెరిగిపోయారు. కాసులకు కక్కుర్తి పడి సైబర్‌ కేటుగాళ్లకు కొందరు బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన క్యాబ్‌, ఆటో డ్రైవర్లను పావులుగా వాడుకుంటున్నారు. సైబర్‌ నేరగాళ్లతో బ్యాంక్‌ మేనేజర్‌ కుమ్మక్కవ్వడం కలకలం రేపుతోంది.

Bank Manager Involved In Cyber Crime
Bank Manager Involved In Cyber Crime (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 8:13 AM IST

Updated : Aug 29, 2024, 9:35 AM IST

Bank Manager Involved In Cyber Crime : సైబర్‌ నేరాల్లో పోలీసులు ఎంతమంది నిందితులను అరెస్ట్‌ చేస్తున్నా డబ్బుల రికవరీ రేటు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం బాధితులు పోగొట్టుకున్న సొమ్ము గంటల వ్యవధిలోనే ఇతర ఖాతాల్లోకి మళ్లుతోంది. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీగా మారిపోతోంది. డబ్బుల రికవరీలో పోలీసులు ఏం చేయలేక పోతున్నారు.

తాజాగా హైదరాబాద్‌ పాతబస్తీలోని షంషేర్‌గంజ్‌ ఎస్​బీఐకి చెందిన 6 ఖాతాల నుంచి రూ.175 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ డబ్బంతా క్రిప్టో రూపంలో చైనాకు తరలిపోయినట్లు దర్యాప్తులో తేల్చారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దుబాయిలో ఉన్న ప్రధాన నిందితుడు చైనా సహా ఇతర దేశాల నేరగాళ్లతో చేతులు కలిపి డబ్బును క్రిప్టోగా మార్చి తరలిస్తున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

బ్యాంకు మేనేజర్ లీలలు వెలుగులోకి : మార్చి-ఏప్రిల్‌ నెలలో షంషేర్‌ గంజ్‌లో ఎస్​బీఐ ఆరు ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో నిఘా పెట్టింది. అనుమానాస్పదంగా కోట్లలో లావాదేవీలు జరగడంతో తొలి ఖాతాదారుడు మహ్మద్‌ బిన్‌ బవజీర్‌, మరో వ్యక్తి షోయబ్‌లను అరెస్ట్‌ చేశారు. దర్యాప్తు క్రమంలో గతంలో అక్కడ పనిచేసిన ఎస్​బీఐ మేనేజర్‌ గాలి మధుబాబు పాత్ర బయటపడింది.

దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితుడి కోసం సందీప్‌ ఉపాధ్యాయ అనే జిమ్‌ ట్రైనర్‌ స్థానికంగా ఉన్న కొందరికి డబ్బు ఆశ చూపి ఖాతాలు తెరిపించాడు. ఇందుకు మేనేజర్‌ మధుబాబు సహకారం తీసుకున్నాడు. ఎటువంటి వ్యాపారం లేకపోయినా ఆటో, క్యాబ్‌ డ్రైవర్లుగా పని చేస్తున్న ఆరుగురికి కరెంట్‌ ఖాతాలు తెరిపించాడు. ఇందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ అంతా సందీప్‌ చూసుకున్నాడు. ఖాతాలు తెరిచేందుకు సహకరించిన బ్యాంక్‌ మేనేజర్‌ మధుబాబుకు లక్షల్లో డబ్బు ముట్ట జెప్పాడు. ఖాతాదారులకు ఒక్కొక్కరికి 20నుంచి 30వేలు చెల్లించాడు.

కేసులో ప్రధాననిందితుడుకి సహకరిస్తున్నవారు అరెస్టు : మరో నిందితుడు షోయబ్‌ చెక్‌ బుక్కులపై ఖాతాదారుల సంతకాలు చేయించుకుని తీసుకున్నాడు. ఖాతాల వివరాలను దుబాయ్‌లో ఉన్న అహ్మద్‌కు పంపాడు. చైనా, కాంబోడియా కోసం పనిచేస్తున్న కాల్‌ సెంటర్లకు అహ్మద్‌ ఆ ఖాతాలను ఇస్తున్నాడు. సైబర్‌ నేరాల ద్వారా ఖాతాల్లో పడిన సొమ్మును షోయబ్‌ ద్వారా విత్‌ డ్రా చేయించి హవాలా ద్వారా అహ్మద్‌ డబ్బులు తీసుకుంటునట్లు సైబర్‌ పోలీసులు గుర్తించారు.

కమిషన్‌ ఒప్పందం మేరకు ఈ డబ్బును క్రిప్టోగా మార్చి సైబర్‌ నేరగాళ్లకు పంపిస్తున్నాడు. కాగా ఈ కేసులో ఇప్పటివరకు షంషేర్‌ గంజ్‌ ఎస్​బీఐ మాజీ మేనేజర్‌ గాలి మధుబాబు, ఖాతాదారుడు బిన్‌ అహ్మద్‌ బవజీర్‌, దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితుడికి సహకరిస్తున్న సందీప్‌ ఉపాధ్యాయ, షోయబ్‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో 8 మంది కోసం పోలీసుల గాలిస్తున్నారు.

ICICI Bank Deputy Manager Gold Fraud : బ్యాంకు డిప్యూటీ మేనేజర్​ చేతివాటం.. రూ.8.65 కోట్లు స్వాహా

శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం.. మేనేజర్ అరెస్టు

Last Updated : Aug 29, 2024, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.