Husband Harassing Pregnant Wife in Hyderabad : ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో ఓ మూర్ఖుడు నిండు గర్భవతిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన హైదరాబాద్‌లో రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల మేరకు రాజేంద్రనగర్‌లో అక్బర్‌ఖాన్, హుమెరా దంపతులు నివసిస్తున్నారు. పెళ్లైనా మొదట్లో ఇద్దరు ఆనందంగానే ఉన్నారు. మొదటిసారి వారికి కుమార్తె జన్మించింది. అంతే ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి వేధింపులకు దిగాడు అక్బర్. కుమార్తె జన్మించిన తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని పుట్టింటికి పంపించాడు. మెట్టినింటిలో కుమార్తె జీవితం ముఖ్యమని భావించిన ఆ తల్లిదండ్రులు వారు అడిగినట్లే ఇచ్చి పంపించారు.
కుమార్తె పుట్టడంతో మార్పు : తర్వాత కొన్నిరోజులు బాగానే ఉన్నారు. రెండోసారి గర్భవతైన హుమెరా మళ్లీ కుమార్తెకు జన్మించింది. మళ్లీ కుమార్తె జన్మించిందని కోపానికి గురైన అక్బర్ వేధింపులు తీవ్రతరం చేశాడు. కొట్టడం, డబ్బులు అడగటం, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో నుంచి పంపిచేయడం వంటివి చేసేవాడు. భర్త వేధింపులు తాళలేక రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పలుమార్లు ఫిర్యాదు చేసింది హుమెరా. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. వేధింపులు మరింత ఎక్కువ కావడం ఇంతకు ముందు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మందుతాగి భర్తల వేధింపులు- పెళ్లి చేసుకున్న వారి భార్యలు! ఎక్కడో తెలుసా?
అత్తమామలు సైతం : భర్త అంత వేధిస్తున్నా అతని తల్లిదండ్రులు అతనికి సపోర్ట్ చేసేవారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మూడోసారి గర్భవతైన హుమెరాను ఆరు నెలల క్రితం తనను మళ్లీ పుట్టింటికి పంపించగా కొన్నిరోజుల కిందట మళ్లీ ఆమె అత్తగారింటికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. 'మళ్లీ నీకు ఆడపిల్లే పుడుతుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో' అంటూ అర్ధరాత్రి నిండు గర్భవతి, ఇద్దరు చిన్నారులను బయటకు గెంటేసాడు.
తనకు సంబంధించిన వస్తువులన్నింటీని బయటపడేశాడు. దీంతో ఏమీ చేయాలో తెలియని ఆమె ఇద్దరు చిన్నారులను పట్టుకుని రోడ్డుపై కూర్చుంది. తనని ఇంట్లోకి రానివ్వాలని, అక్కడ నుంచి తీసుకెళ్లాలని భర్తకు ఫోన్ చేయగా అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆడపిల్లలు పుట్టినందుకు తనను వేధిస్తున్న తన భర్త అక్బర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.
ప్రేమ పేరుతో వేధింపులు! - యాసిడ్ తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
అనారోగ్య కుమార్తెను కట్టబెట్టావంటూ అల్లుడి వేధింపులు - తట్టుకోలేక మామ ఆత్మహత్య