Husband Pressure Wife To Make Nude Video Calls at Online : యాప్‌లో నగ్నంగా ఫోన్‌కాల్స్ మాట్లాడాలని తన భర్త హింసిస్తున్నాడని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. కొవిడ్ సమయంలో ఇలాగే వీడియో కాల్స్ మాట్లాడించి దాదాపు 18 లక్షల రూపాయలు సంపాదించాడని సదరు మహిళ తెలిపింది. తాజాగా తన వీడియో ఒకటి వైరల్ కావడంతో తనపైనే మొత్తం తప్పు వేసి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆమె కన్నీటి పర్యంతమైంది. భర్తపై కేసు పెట్టేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్తే అక్కడు కూడా ఓ కానిస్టేబుల్ తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు తెలిపింది.
రూ.18 లక్షలు సంపాదన : ఈ మేరకు తాజాగా బాధిత మహిళ తన భర్త వేధింపులను మీడియాకు వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో డబ్బుల కోసం నగ్నంగా ఫోన్ చేసి మాట్లాడాలంటూ తన భర్త వేధింపులకు గురి చేశాడని బాధిత మహిళ వాపోయారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఓ ప్రైవేట్ యాప్‌లో తన భర్త ఓ ఐడీ క్రియేట్ చేశాడని తెలిపారు. డబ్బులు వస్తాయని, నగ్నంగా కాల్స్ మాట్లాడాలంటూ ఒత్తిడి చేశాడని పేర్కొన్నారు. భర్త వేధింపులకు భయపడి ఆన్‌లైన్ కాల్స్‌లలో అసభ్య సంభాషణ, చిత్రాలతో 18 లక్షల రూపాయల వరకూ సంపాదించామని సదరు మహిళ వెల్లడించారు. వచ్చిన డబ్బులతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేశామని ఆమె తెలిపారు.
లైంగికంగా వేధిస్తున్న కానిస్టేబుల్ : అయితే కొంతకాలానికి తమ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడినా మళ్లీ తనపైన ఒత్తిడి తెచ్చేవాడన్నారు. తాజాగా ఓ న్యూడ్ వీడియో వైరల్ కావడంతో తనను భర్త దూరం పెట్టినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై కేసు పెట్టేందుకు పోలీసు స్టేషన్‌కి వెళ్తే అక్కడ ఓ కానిస్టేబుల్ తనను లైంగికంగా వేధిస్తూ అసభ్యకర మెసేజులు పెడుతున్నారని వాపోయారు. అధికారులు తనకు రక్షణ కల్పించడంతో పాటు భర్తతో జీవించేలా చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కోరారు.
యువతి వీడియో కాల్ - లిఫ్ట్ చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి దిమ్మతిరిగే షాక్
మ్యాట్రిమోనీ సైట్లో మాయ లేడి.. నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్.. టెకీకి రూ. కోటికిపైగా టోకరా