ETV Bharat / state

'వైఎస్సార్సీపీ' ప్రచార పిచ్చి - ప్రభుత్వ సొమ్ము వృధా - జగన్‌ బాధ్యత వహిస్తారా? - context of election code in AP

CM Jagan Photo on Government Schemes: ప్రచార పిచ్చి కోసం ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టిన సీఎం జగన్‌ తిక్కను ఎన్నికల సంఘం కుదిర్చింది. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలపై ఉన్న జగన్‌ బొమ్మను మడతపెట్టింది. జగన్‌ ముద్ర ఉన్న ఏ పత్రాలూ జారీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు వందల కోట్ల ప్రజాధనం వృథాకు బాధ్యులెవరు?

CM Jagan Photo on Government Schemes
CM Jagan Photo on Government Schemes
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 8:56 AM IST

'వైఎస్సార్సీపీ' ప్రచార పిచ్చి - ప్రభుత్వ సొమ్ము వృధా - జగన్‌ బాధ్యత వహిస్తారా?

CM Jagan Photo on Government Schemes : ప్రభుత్వాలు దశాబ్దాలుగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. కానీ ఏ ముఖ్యమంత్రికీ రాని వింత ఆలోచన జగన్‌కే వచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వీటిపైనా జగన్‌ తన బొమ్మను అచ్చేయించుకున్నారు. అదేదో ప్రభుత్వ అధికార గుర్తైనట్టు నవరత్నాల లోగో ముద్రించారు. 1బీ, అడంగల్, భూయాజమాన్య హక్కు పత్రం, ఫ్యామిలీ మెంబర్‌ ధ్రువీకరణ పత్రం ఇలా గ్రామ, వార్డు సచివాలయాలు,మీ సేవా కేంద్రాలద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువపత్రాలపై. తన బొమ్మ ముద్రించుకున్నారు.

ఆ పత్రాలూ జారీ చేయవద్దు : రాష్ట్రం సొంత సామ్రాజ్యమైనట్టు, ప్రతి ప్రభుత్వ కార్యంలోనూ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించుకునన్నారు. నవరత్నాల లోగోను వేయించారు! జగన్‌ పైత్యానికి ఎన్నికల సంఘం సరైన మందు వేసింది. ఎన్నికల కోడ్‌ (Election Code) అమలు దృష్ట్యా జగన్‌ ముద్రతో ఉన్న ఏ ధ్రువపత్రాలూ జారీ చేయొద్దనని ఆదేశాలిచ్చింది.

జగన్ బొమ్మలు కవర్ చేసేందుకు అవస్థలు- వైసీపీ ప్రచార పిచ్చితో ఉద్యోగుల పాట్లు

జగన్‌ దీనికి బాధ్యత వహిస్తారా? : వైఎస్సార్సీపీ ప్రభుత్వం 'జగనన్న సురక్ష (Jagananna Suraksha)' పేరుతో ఉచితంగా ఇచ్చేందుకు అంటూ భారీగా ధ్రువపత్రాలు ముద్రించింది. ఒక్కో పత్రం ముద్రణకు 50 రూపాయల పైనే ఖర్చు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్కోచోట ఇలాంటి పత్రాలు వందల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టాలని క్షేత్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే ఇవి చెల్లవని తెలిసీ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్‌ దీనికి బాధ్యత వహిస్తారా? తన జేబులో నుంచి డబ్బు చెల్లిస్తారా?

ప్రచార పిచ్చి- అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలోనూ సీఎం జగన్​పై నేతల ఆహా ఓహో!

మీసేవ నిర్వాహకుల ఆవేదన : జగన్‌ రెడ్డి ప్రచార పిచ్చి మీసేవా నిర్వాహకుల కొంప ముంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల వరకూ మీసేవ కేంద్రాలున్నాయి. వీటి నిర్వాహకులు 3 రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించి జగన్‌ బొమ్మ ఉన్న ఒక్కో పత్రాన్నితీసుకున్నారు. ఒక్కో మీసేవా కేంద్రంలో ఇలాంటివి వెయ్యి నుంచి 2 వేల వరకు ధ్రువపత్రాలు నిల్వ ఉన్నాయి. ఈసీ ఆదేశాలతో అవన్నీ నిరుపయోగమైనట్లేనని మీ సేవా నిర్వాహకులు వాపోతున్నారు. కనీసం 3 వేల నుంచి, 6వేల రూపాయల వరకూ నష్టమని లబోదిబోమంటున్నారు. రెండ్రోజులుగా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 1బీ, అడంగల్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాలను చాలా మంది ఆశ్రయిస్తున్నారు. పత్రాలు అందుబాటులో లేక వారిని వెనక్కి పంపించేస్తున్నారు. అధికారులు మాత్రం జగన్‌ బొమ్మ, నవరత్నాల లోగో లేని పత్రాలను జిల్లాలకు పంపించినట్టు చెబుతున్నారు.

పార్టీ ప్రచారం కోసం పీహెచ్‌సీలపై చిన్నచూపు - జగనన్న ఆరోగ్య సురక్షకు కోట్ల రూపాయల ఖర్చు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.