ETV Bharat / state

పదేళ్లుగా విదేశాలకు నిషేధిత ఔషధాల ముడి పదార్థాల సరఫరా - ఈ దందా వెనక ఎవరున్నారు? - Drugs Seized In Hyderabad - DRUGS SEIZED IN HYDERABAD

Huge Drugs Seized In Hyderabad : ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదేళ్లుగా నిషేధిత ఔషధాల ముడి పదార్థాలు విదేశాలకు సరఫరా చేస్తున్న పీఎస్ఎన్ ఫార్మా సంస్థపై ఔషధ నియంత్రణ శాఖ, ఎక్సైజ్‌ పోలీసుల దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. విదేశాలకే కాకుండా హైదరాబాద్‌లోనూ ఈ సంస్థ నుంచి డ్రగ్స్‌ సరఫరా అయినట్టు అధికారులు భావిస్తున్నారు. ఏకంగా రూ.9 కోట్ల విలువైన మెపిడ్రిన్‌ నిల్వలు ఫార్మా సంస్థలో ఉన్నట్టు బయటపడింది.

9 Crore Worth Drugs Seized In IDA Bollaram
Huge Drugs Seized In Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 10:45 AM IST

హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత - ఫార్మా సంస్థలో రూ.9 కోట్ల విలువైన మెపిడ్రిన్‌ నిల్వలు

Huge Drugs Seized In Hyderabad : రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయం రోజు రోజుకీ చాపకింద నీరులా సాగుతోంది. కొందరు యువకులు కమీషన్ల కోసం ఈ దారిని ఎంచుకుంటున్నారు. మరికొందరు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి స్మగ్లర్లుగా మారుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఆయా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ శివారు కేంద్రంగా నిషేధిత ఔషధాల ముడి పదార్ధాల తయారీ కేంద్రం గుట్టును ఔషధ నియంత్రణ శాఖ, ఎక్సైజ్‌ పోలీసులు గుట్టురట్టు చేశారు. పదేళ్లుగా సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని పీఎస్ఎన్ ఔషధ తయారీ సంస్థ కొనసాగుతోంది. కస్తూరి రెడ్డి అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్​లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు - రూ.9 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం​ - Huge Drug bust in Hyderabad

అయితే గుట్టు చప్పుడు కాకుండా అతను సంస్థలో నిషేధిత మెపిడ్రిన్‌ ముడి పదార్థాల్ని తయారు చేయిస్తూ పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. గల్ఫ్‌ దేశాలకు నిషేధిత డ్రగ్స్‌ సరఫరా జరుగుతున్నట్టు ఇంటర్‌పోల్‌ సీబీఐ అధికారులకు లేఖ రాసింది. పోలీసులకు దీనిపై సమాచారం అందించగా ఔషధ నియంత్రణ శాఖకు తెలిపారు. దీంతో ఎక్సైజ్‌ పోలీసులతో కలిసి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సంస్థపై దాడులు నిర్వహించారు. అధికారుల సోదాల్లో అనేక కీలకాంశాలు బయటపడ్డాయి. పదేళ్లుగా నిషేధిత ముడి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తున్నట్టు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు గుర్తించారు.

9 Crore Worth Drugs Seized In IDA Bollaram : సోదాలు చేసిన సమయంలో నిషేధిత పదార్థాన్ని వాడే ఫార్ములాను తొలగించినట్టు వెల్లడైంది. 4 గంటల పాటు ఆబ్కారీ, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రధానంగా నిషేధిత ముడిసరుకును గుట్టు చప్పుడు కాకుండా ఉత్పత్తి చేసి సిగరెట్‌ ప్యాకెట్లలో విదేశాలకు తరలిస్తున్నట్టు తేలింది. సోదాల్లో రూ.9 కోట్ల విలువైన 90 కిలోల మెపిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఫార్మా సంస్థ చేస్తున్న ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? విదేశాలకు ఎలా నిషేధిత డ్రగ్స్‌ను సరఫరా చేయగలుగుతున్నారు? హైదరాబాద్‌లో కూడా ముడి పదార్థాన్ని ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. మరో సంస్థలోనూ ఈ తరహా తతంగం నడుస్తున్నట్టు ఇంటర్‌పోల్‌ సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సంస్థ పై కూడా అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం.

డ్రగ్స్ అమ్మితే అరెస్టే కాదు, ఆస్తులు కూడా సీజ్ - Freezing Of Property Under NDPS ACT

బాలికలకు డ్రగ్స్​ అలవాటు చేసి రేవ్​ పార్టీల్లో వ్యభిచారం! - జగిత్యాల జిల్లాలో గంజాయి ముఠా అరాచకాలు - drug racket bust in jagtial

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.