ETV Bharat / state

వెస్ట్రన్ టాయిలెట్​తో ఇన్​ఫెక్షన్స్​ వస్తాయా? - ఏం చేయాలి?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 1:40 PM IST

Updated : Feb 18, 2024, 2:07 PM IST

How To Use Western Toilet : పట్టణాలు, నగరాల్లో ఇప్పుడు దాదాపుగా.. వెస్ట్రన్ టాయిలెట్స్ వాడుతున్నారు. అయితే.. వీటిని వాడటం వల్ల ఇన్​ఫెక్షన్స్ వస్తాయని ఓ చర్చ ఉంది. మరి.. ఇది నిజమేనా? నిజమే అయితే.. ఇన్​ఫెక్షన్స్​ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

How To Use Western Toilet
How To Use Western Toilet

How To Use Western Toilet : మారుతున్న కాలానికి అనుగుణంగా మనం వాడే వస్తువుల విషయంలో ఎన్నో మార్పులు వచ్చాయి.. వస్తున్నాయి.. వస్తూనే ఉంటాయి! తిని, తాగే వస్తువుల నుంచి.. వాష్​ రూమ్​లో వినియోగించే ఐటమ్స్ వరకూ ఎన్నో ఛేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే ఉపయోగించే వెస్ట్రన్ టాయిలెట్లు.. ఇప్పుడు మన దేశంలో విరివిగా వాడేస్తున్నారు. నేడు కొత్తగా నిర్మించుకుంటున్న ఇళ్లలో దాదాపుగా అన్నీ అవే టాయిలెట్స్ వాడుతున్నారు.

ఈ వెస్ట్రన్ టాయిలెట్ల వాడకం అనేది పల్లెటూర్లతో పోల్చితే.. పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఉంది. ఇళ్లతోపాటు ఆఫీసులు, పబ్లిక్‌ ప్లేసుల్లో కూడా ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. వీటివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. సాంప్రదాయ ఇండియన్‌ టాయిలెట్లతో పోల్చి చూస్తే.. వెస్ట్రన్ టాయిలెట్లు అనారోగ్యంగా ఉన్నవారికి సౌకర్యంగా ఉంటాయి.

మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవారికి ఈజీగా ఉంటాయి. అలాగే వృద్ధులు కూడా చాలా సౌకర్యవంతంగా వాడుకోవచ్చు. ఇవి వారికి కుర్చీలో కూర్చున్న పొజిషన్‌ ఉంటుంది కాబట్టి.. అనువుగా ఉంటాయి. అయితే.. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఇలా టాయిలెట్ సీటు మీద కూర్చోవడం ద్వారా ఏమైనా ఇన్ఫెక్షన్లు వస్తాయా? అనే సందేహం చాలా మందిలో ఉంది.

దీనికి నిపుణులు ఏమంటున్నారంటే.. వెస్ట్రన్ టాయిలెట్ల ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయనేది కేవలం అపోహ అంటున్నారు. అవగాహన లేనివారు మాత్రమే ఈ తరహా కామెంట్ చేస్తారని అంటున్నారు. సరైన శుభ్రత పాటించకపోతేనే ఇన్ఫెక్షన్స్ వస్తాయని.. సాంప్రదాయ టాయిలెట్ల ద్వారా ఈ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అందుకే.. ఏ తరహా టాయిలెట్ వినియోగించినా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇన్ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణాలు ఇవే!

  • టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందట.
  • కాబట్టి.. కచ్చితంగా చేతులను సబ్బుతో వాష్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇలా చేయడం వల్ల దాదాపు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువని తెలియజేస్తున్నారు
  • అలాగే వెస్ట్రన్ టాయిలెట్లను వాడేటప్పుడు టిష్యూతో టాయిలెట్‌ను క్లీన్ చేసుకోవాలట. ఇలా చేయడం ద్వారా.. దానిపై ఉన్న మరకలన్నీ తొలగిపోతాయని సూచిస్తున్నారు.
  • టిష్యూ లేకపోతే వాటర్‌ ఫ్లష్‌ హ్యాండిల్‌తో టాయిలెట్‌పై కూర్చునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని వాడుకోవాలట.
  • టాయిలెట్‌ను వాడిన తర్వాత కచ్చితంగా ఫ్లష్‌ చేయాలి. దీనివల్ల చాలా వరకు మలినాలు తొలగిపోతాయి.
  • ఇంట్లోనే కాకుండా.. బహిరంగ ప్రదేశాల్లో టాయిలెట్‌ను వాడేటప్పుడు తప్పకుండా ముందు ఫ్లష్‌ చేయాలి. ఆ తర్వాతే ఉపయోగించాలి. లేకపోతే.. యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
  • ఇంట్లోని టాయిలెట్లను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి.
  • ఈ విధంగా టాయిలెట్లను ఉపయోగిస్తే.. ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారినా పడకుండా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అలర్ట్ : మహిళలు, పురుషుల్లో వేర్వేరుగా - గుండెపోటు లక్షణాలు!

షాకింగ్ : కారు సీటుతో సంతాన సామర్థ్యానికి దెబ్బ - పిల్లలు పుట్టరా?

ఏ పండులో ఎంత షుగర్ ఉంటుంది? - మీకు తెలుసా!

Last Updated : Feb 18, 2024, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.